ప్రాణాలు పోతేనే పట్టించుకుంటారా
బారి వంతెనపై మృత్యు శకటంలా గుంత!
నెలలు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు.. ప్రజాప్రతినిధులు
తక్షణమే మరమ్మతులు చేపట్టాలని స్థానికుల డిమాండ్
దేవరుప్పుల అక్టోబర్ 04 మేజర్ న్యూస్ (సూర్య):
దేవరుప్పుల మండల కేంద్రంలోని వాగుపై ఉన్న బారి వంతెన మొదటి భాగంలో ఏర్పడిన గుంత రోజురోజుకు ప్రమాదకరంగా మారుతోంది. గుంత ఏర్పడి నెలలు గడుస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు పోతేనే అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించుకుంటారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వాహనాలు, ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ మార్గంలో గుంత కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అది మృత్యు శకటంలా మారిందని స్థానికులు పేర్కొన్నారు. ప్రజల భద్రత, ప్రయాణ సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి వంతెనపై ఉన్న గుంతను పూడ్చి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. సమస్యను పరిష్కరించకపోతే ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు.
సూర్య దినపత్రిక దేవరుప్పుల మండల ప్రతినిధి భాషిపాక ఎల్లేష్