BREAKING
జలసిరి నీటి కుంటల్లో గంగపుత్రులకు చేపల పెంపకానికి అవకాశం కల్పించాలి వరుణ దేవుని యాగం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ముత్తుముల నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగడంతో వైఎస్సార్సీపీలో టికెట్ల కోసం పోటీ నెలకొంది. శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు కరెంటు బిల్లుల భారంపై హరీశ్‌రావు ఫైర్: "పండుగల ముందు ప్రజలకు పిడుగు లాంటి వార్త" కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణం సాధించిన శంకు కృపారావుకు వర్ల రామయ్య అభినందనలు పొదలకూరు శ్రీ పోలేరమ్మ జాతరకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు మాల్తుమ్మెద సొసైటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం బొగ్గు లైన్లో నివసించే ప్రతి ఒక్కరికి రెండు సెంట్ల ఇండ్ల స్థలం ఇచ్చి, ఇల్లు నిర్మించి ఇవ్వాలి- మంత్రి ఫరూక్ కి సిపిఎం వినతి "సేవా సేతు అభియాన్" ద్వారా ప్రజలకు చేరువవుతున్న "పీఎం-సూర్యఘర్: ముఫ్త్ బిజిలీ యోజన" - ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాల సిహెచ్‌సి రాపూర్‌కు జిల్లా స్థాయి స్వచ్ఛ ఆసుపత్రి అవార్డు బాపట్ల శ్రీ క్షీర భావనారాయణ స్వామి వారి ఆలయంలో ఘనంగా వరుణ జపములు మరియు వరుణ యాగం కడప కలెక్టర్ కార్యాలయంలో డీఆర్ కు వినతి పత్రం అందజేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నెల్లూరు నగర నియోజకవర్గంలో కార్పొరేటర్లుగా పోటీ చేయడానికి పెరుగుతున్న పోటీ

సీఈసీ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి

Select Suryaa Now
సీఈసీ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి

చేర్యాల : కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ డిమాండ్ చేశారు. మంగళవారం చేర్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ శ్రీవాస్య సందీప్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రసాదించిన స్వతంత్ర ఎన్నికల వ్యవస్థను కాపాడాల్సిన సీఈసీ కేంద్ర బిజెపి ప్రభుత్వానికి కీలుబొమ్మగా పనిచేస్తూ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో ఓటర్ల జాబితాలో అక్రమాలు, ప్రతిపక్ష పార్టీల ఫిర్యాదులపై స్పందించకపోవడం, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడంపై ప్రజల్లో ఎన్నికల సంఘంపై విశ్వాసం సన్నగిల్లుతోందని ఆయన అన్నారు. దేశంలో ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో నాయకుల లక్షలాది ఓట్లను తొలగించిందని పండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం 2002 సంవత్సరం ప్రమాణికం నిబంధన పెట్టి ఓటర్లను అనేక ఇబ్బందుల పాలు  చేశారని అన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థ అధిపతిగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బాధ్యతను విస్మరించిన జ్ఞానేష్ కుమార్ ను తక్షణమే తొలగించాలని, లేనిపక్షంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, కుడిక్యాల బాల్ మోహన్, నంగి కనకయ్య, పొన్నబోయిన మమత, గూడెపు సుదర్శన్, మనెపల్లి కిష్టయ్య, నంగి సత్తయ్య, గోమారపు నర్సయ్య, సిద్దిరాం భద్రయ్య, బండారి శ్రీనివాస్, చరణ్, రాజు, మల్లేశం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.