పొదలకూరు శ్రీ పోలేరమ్మ జాతరకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు
పొదలకూరు, మేజర్ న్యూస్ : 60 వేల మందికి పైగా తరలిరానున్న భక్తజనం. భక్తులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు. అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలి. 2019 తర్వాత ఆగిపోయిన పనులన్నీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొదలకూరు ఆర్&బీ అతిథిగృహంలో శ్రీ పోలేరమ్మ తల్లి జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేసిన సోమిరెడ్డి. ఎన్నో దశాబ్దాల తర్వాత పొదలకూరులో శ్రీ పోలేరమ్మ తల్లి జాతరను అంగరంగవైభవంగా నిర్వహించుకుంటుండటం సంతోషంగా ఉంది ఈ రోజు ప్రారంభమైన జాతర మహోత్సవం గురువారం సాయత్రం వరకు కొనసాగనుంది జాతరలో ముఖ్యమైన గురువారం 45 వేల నుంచి 60 వేల మంది వస్తారని అధికారులు అంచనా వేశారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని ముందుకు సాగాలి అమ్మవారి దర్శనంతో పాటు ఊరేగింపు తదితర కార్యక్రమాల్లో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా 200 మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వర్తిస్తారు క్యూలు, బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు నిఘా కోసం తాత్కాలికంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు..డ్రోన్లు కూడా పర్యవేక్షిస్తుంటాయి గురువారం మధ్యాహ్నం నుంచి ట్రాఫిక్ ను చాటగొట్ల నుంచి బిరదవోలు వైపు మళ్లిస్తారు పట్టణంలో ఐదు చోట్ల ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం కొనసాగుతుంది భక్తుల దాహార్తి తీర్చేందుకు 35 వేల వాటర్ ప్యాకెట్లు, 1000 వాటర్ బాటిల్స్ తో పాటు దాతల సహకారంతో మరో 3 వేల మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతారు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించమని పంచాయతీ అధికారులకు సూచించాం...మండల పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు కూడా జాతర వద్ద పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తారు చెత్తాచెదారాల తొలగింపునకు 100 మందికి పైగా సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించాను శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటుకున్నాను 2019 తర్వాత ఆగిపోయిన కీలక ప్రాజెక్టులు పూర్తి కావాలని, సోమశిల దక్షిణ కాలువ, డేగపూడి –బండేపల్లి కాలువ, మెగా మినరల్ వాటర్ ప్లాంట్ ప్రయోజనాలు ప్రజలకు అందాలని ఆకాంక్షిస్తున్నాను సర్వేపల్లి రిజర్వాయర్ ఆధునికీకరణ పనులను కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం...అమ్మవారి ఆశీస్సులతో పనులు త్వరితగతిన పూర్తి కావాలని ఆశిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ తో కలిసి లక్ష కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ లో రాయలసీమ, ప్రకాశం జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాన్ని కూడా భాగం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడికి విన్నవిస్తున్నాను మా సంకల్పాలకు శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయని నమ్మకం మాకుంది