కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కొందుర్గ్ మండల అధ్యక్షుడిగా మల్లని యాదయ్య
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కొందుర్గు మండల అధ్యక్షుడిగా మండల పరిధిలోని చెరుకుపల్లి గ్రామ సర్పంచ్ మల్లని యాదయ్య ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో, మంగళవారం షాద్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీధర్, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ యాదయ్యకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి, ఎస్సీ సెల్ మండల అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీధర్ కు, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చిన్న ఎల్కిచెర్ల సర్పంచ్ రాజకుమార్, శ్రీరంగాపూర్ సర్పంచ్ బి రమేష్, నాయకులు దుర్గని శ్రీను, బొరిగే నరేందర్ , జిల్లెల్ల ప్రసాద్ , శ్రీనివాస్, కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు.
ఈరమొల్ల సత్యనారాయణ, మేజర్ న్యూస్, కొందుర్గ్.