ఈశ్వరయ్యను పరామర్శించినపట్టణ కార్యదర్శి
గూడరు, మేజర్‌న్యూస్ : అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గుజ్జుల ఈశ్వరయ్యను సిపిఐ గూడూరు పట్టణ కార్యదర్శి యాదాల సునీల్ పరామర్శించారు. మంగళవారం హాస్పిటల్‌కు వెళ్లి కామ్రేడ్ గుజ్జుల ఈశ్వరయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని, ఆరోగ్య పరిస్థితి బాగుందని వైద్యులు తెలిపినట్లు యాదాల సునీల్ పేర్కొన్నారు. కామ్రేడ్ గుజ్జుల ఈశ్వరయ్య త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని ప్రజా ఉద్యమాల్లో తిరిగి పాల్గొంటారని ఆయన తెలియజేశారు.