రేణిగుంట పోలీస్ స్టేషన్‌లో ప్రొబేషనరీ డిప్యూటీ తహశీల్దార్ శిక్షణ
రేణిగుంట పోలీస్ స్టేషన్‌లో ప్రొబేషనరీ డిప్యూటీ తహశీల్దార్ శిక్షణ
రేణిగుంట మేజర్ న్యూస్: ప్రొబేషనరీ డిప్యూటీ తహశీల్దార్‌గా ఎంపికైన షేక్ యజ్దాని బాషా రేణిగుంట పోలీస్ స్టేషన్‌లో శిక్షణ నిమిత్తం రిపోర్ట్ చేసుకున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు వారం రోజుల పాటు పోలీస్ విధానాలు, శాంతిభద్రతల పరిరక్షణ, పోలీస్–రెవెన్యూ శాఖల సమన్వయం, భూవివాదాలు, బందోబస్తు తదితర అంశాలపై క్షేత్రస్థాయి అవగాహన పొందనున్నారు. ఈ సందర్భంగా రేణిగుంట పోలీస్ అధికారులు ఆయనకు స్వాగతం పలికి, శిక్షణ విజయవంతంగా పూర్తి కావాలని ఆకాంక్షించారు.