దసరా ఉత్సవాలకు తెదేపా నేత భార్గవ రామ్ ను ఆహ్వానించిన ఆర్యవైశ్యులు
దసరా ఉత్సవాలకు టిడిపి సీనియర్ నేత భార్గవ్ రామ్ కుఆహ్వానం
ఫోటో. ఆహ్వాన పత్రిక అందజేస్తున్న దృశ్యం
ఆళ్లగడ్డ, మేజర్ న్యూస్
ఆళ్లగడ్డ పట్టణంలోని అమ్మవారి శాలలో ఈనెల 11 నుంచి ప్రారంభమయ్యే కన్యకా పరమేశ్వరి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతూ ఆళ్లగడ్డ టిడిపి సీనియర్ నాయకులు భార్గవ్ రామ్ కు ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన అమ్మవారి శాల, ఆర్యవైశ్య సంఘం సభ్యులు మంగళవారం ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దేవి శెట్టి హరీష్ బాబు, కార్యనిర్వాహక అధ్యక్షులు బైసాని రవి ప్రకాష్,ఉపాధ్యక్షులు గుండా నాగ ప్రదీప్, ఆలువాల శివచరణ్, నిచ్చెన మెట్ల రామయ్య, కోశాధికారి రేపాకుల శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.