BREAKING
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో ప్రతిభ కనపరచిన గిరిజన విద్యార్థులు కడప నగరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు 100 కోట్ల ప్రయాణాలతో 'స్త్రీ శక్తి' చారిత్రాత్మక ఘనత. -మహిళలతో పాటు ఆర్టీసీ సిబ్బందికి ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు గ్రామ గడపకే వైద్యం : మంత్రి సత్యకుమార్ యాదవ్ కోదండ రామునికి ఘనంగా ఘటాభిషేకం మహారాష్ట్రలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ భారీ విస్తరణ.. ప్రత్యేక కార్యక్రమాలతో దూసుకెళ్తున్న అభిమానులు! సోలార్ విద్యుత్‌తో పేదలకు భారీ ప్రయోజనం రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఆల్ఫోర్స్ విద్యార్థుల ఎంపిక యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్.. మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ... ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణాలు దేచుపాలెంలో రూ.31 లక్షలతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ భవనం ప్రారంభం రేణిగుంట పోలీస్ స్టేషన్‌లో ప్రొబేషనరీ డిప్యూటీ తహశీల్దార్ శిక్షణ గర్భిణీలు, బాలింతలు పోషకాహారాన్ని వినియోగించుకోవాలి దసరా ఉత్సవాలకు తెదేపా నేత భార్గవ రామ్ ను ఆహ్వానించిన ఆర్యవైశ్యులు ఈశ్వరయ్యను పరామర్శించినపట్టణ కార్యదర్శి

ఘనంగా కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మి జన్మదిన వేడుకలు...

Select Suryaa Now
ఘనంగా కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మి జన్మదిన వేడుకలు...

పనిచేసే లక్ష్మిగా..పనబాక లక్ష్మికి ప్రత్యేక గుర్తింపు...  భగవంతుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలి...  మాజీ జడ్పీ చైర్ పర్సన్ చెంచలబాబు యాదవ్ ఆకాంక్ష

నెల్లూరు, వేదాయపాలెం,  మేజర్ న్యూస్  :   నెల్లూరురూరల్ నియోజకవర్గం పరిధిలోని మైపాడు రోడ్డు ప్రాంతంలో ఉన్న సిబివై కళ్యాణ మండపంలో మాజీ కేంద్ర మంత్రి పనభాక లక్ష్మీ జన్మదిన వేడుకలను మాజీ జడ్పీ చైర్ పర్సన్.. టిడిపి సీనియర్ నేత పొన్నేబోయిన చెంచల బాబుయాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని  నాయకులు..  కార్యకర్తలు.. భారీ కేక్ కట్ చేసి పరస్పరం తినిపించుకుంటూ ఆత్మీయ వాతావరణం మధ్య అట్టహాసంగా సంబరాలు జరుపుకున్నారు. మొదట స్థానిక బాలాజీనగర్..వేప దొరువు ప్రాంతంలో ఉన్న గీతామయి వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వయో వృద్ధుల సమక్షంలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పుట్టినరోజు వేడుకలు జరిపారు. కేక్ కట్ చేసి వృద్ధులకు పంచిపెట్టారు. పేదలకు అల్పాహారాన్ని అందజేశారు.ఈ సందర్భంగా చెంచలబాబు యాదవ్ మాట్లాడుతూ, ఉమ్మడినెల్లూరు జిల్లాకు చెందిన తొలి కేంద్ర మంత్రిగా పనబాక లక్ష్మి ఉత్తమ ప్రజాసేవను అందించారని కొనియాడారు. పనిచేసే లక్ష్మిగా మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి కోట్లాది రూపాయల నిధులు రాబట్టి జిల్లా సమగ్ర అభివృద్ధికి పనబాక లక్ష్మి ఎంతగానో కృషి చేశారని తెలిపారు. గూడూరు నుండి సికింద్రాబాద్ కు సింహపురి ఎక్ ప్రెస్ ను మంజూరు చేయించడంలో పనబాక లక్ష్మి కృషి మరువ లేనిదన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)సభ్యురాలుగా విశిష్ట సేవలందించారని కొని యాడారు. ఎంతోమంది పేదలకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దివ్యమంగళ స్వరూప దర్శనభాగ్యాన్ని కల్పించాలని వివరించారు. నిస్వార్థ ప్రజా సేవకురాలిగా అన్ని వర్గాల నుంచి విశేష ఆదరాభిమానాలు పొందుతున్న పనబాక లక్ష్మి భగవంతుని ఆశీస్సులతో నిండునూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతోనూ.. మానసిక ప్రశాంతతల మధ్య ప్రజా జీవనంలో తరించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువతనేత శివప్రసాద్, 2వ డివిజన్ జనసేన ఇన్చార్జి పవన్ యాదవ్, కోవూరు మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ ఉడతా సుమన్, స్థానిక నాయకులు సురేష్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.