భారత ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవమును పురస్కరించుకొని *సేవా సంకల్ప అభియాన్* కార్యక్రమంలో భాగంగా చింతలపూడి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో ఉచిత మెడికల్ క్యాంప్ ను ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రారంభించారు
చింతలపూడి మేజర్ న్యూస్.. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత మెడికల్ క్యాంపులను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.త్వరలోనే చింతలపూడి ప్రభుత్వం ఏరియా హాస్పిటల్ నిర్మాణ పనులను పూర్తి చేసి, ఆస్పత్రి ప్రారంభించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులో తీసుకుని రావడానికిరావడానికి సన్నాహాలు చేస్తున్నా మన్నారు. చింతలపూడి అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని త్వరితగతిన పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చింతలపూడి శాసనసభ్యులు కుమార్ అన్నారు.. కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ బేబీకమల, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రసూల్, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్. ఖలీల్. చింతలపూడి.ఏలూరు జిల్లా