వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారికి ఆహ్వానం పలికిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.
విజయవాడలో అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్–2.0కు హాజరు కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని ఆహ్వానించారు.సోమవారం కలకత్తా లోని సచివాలయ భవనం నబన్నా సభాఘర్ లో సువేందు అధికారిని కలిసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. విజయవాడలో నిర్వహించనున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్–2.0కు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు.