శ్రీశైలంలో మహిళపై దేవస్థానం ఉద్యోగి అఘాయిత్యం..!
శ్రీశైల దేవస్థానం పరిధిలోని గంగా సదన్ వసతి సముదాయంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగి ఓ మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడినట్లు సమాచారం. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటనపై సదరు మహిళ ఇవాళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గంగా సదను పక్కన ఉన్న హోటల్ పనిచేస్తున్న మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఉద్యోగిపై బాధిత మహిళ ఫిర్యాదు మేరకు విచారిస్తున్నట్లు ఎస్ఐ సుబ్బారెడ్డి తెలిపారు.