BREAKING
మహారాష్ట్రలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ భారీ విస్తరణ.. ప్రత్యేక కార్యక్రమాలతో దూసుకెళ్తున్న అభిమానులు! సోలార్ విద్యుత్‌తో పేదలకు భారీ ప్రయోజనం రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఆల్ఫోర్స్ విద్యార్థుల ఎంపిక యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్.. మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ... ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణాలు దేచుపాలెంలో రూ.31 లక్షలతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ భవనం ప్రారంభం రేణిగుంట పోలీస్ స్టేషన్‌లో ప్రొబేషనరీ డిప్యూటీ తహశీల్దార్ శిక్షణ గర్భిణీలు, బాలింతలు పోషకాహారాన్ని వినియోగించుకోవాలి దసరా ఉత్సవాలకు తెదేపా నేత భార్గవ రామ్ ను ఆహ్వానించిన ఆర్యవైశ్యులు ఈశ్వరయ్యను పరామర్శించినపట్టణ కార్యదర్శి అంగన్వాడీ ఉత్సవం–పిఎం మాతృ వందన యోజనపై అవగాహన స్థానిక పోరుకు కూటమి ‘మాస్టర్‌ ప్లాన్‌’ ! జాతీయ సదస్సులో సత్తా చాటిన నారాయణ ఫార్మసీ విద్యార్థులు హెచ్‌ఐవి /ఎయిడ్స్ సమీక్ష సమావేశం ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కు వినతి పత్రం

పట్టభద్రుల ఓటు.. ప్రజాస్వామ్యానికి బలం-డా గుండెబోయిన రమేష్ యాదవ్

Select Suryaa Now
పట్టభద్రుల ఓటు.. ప్రజాస్వామ్యానికి బలం-డా గుండెబోయిన రమేష్ యాదవ్

చౌటుప్పల్‌,మేజర్ న్యూస్:పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఫిజియోథెరపిస్ట్‌ డా. గుండేబోయిన రమేష్‌ యాదవ్‌ అన్నారు. వరంగల్‌–నల్గొండ–ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు జాబితాలో పేరు నమోదు కోసం ఫారం–18ను ఉపతహసీల్దార్‌ సూరయ్యకు అందజేశారు.

ఈ సందర్భంగా రమేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. “పట్టభద్రుల ఓటు కేవలం హక్కు కాదు.. బాధ్యత కూడా. అర్హత ఉన్న ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలి. మన సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించే ప్రతినిధిని ఎన్నుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. ఓటు నమోదు విషయంలో నిర్లక్ష్యం చేయకుండా చివరి తేదీ కోసం ఎదురుచూడకుండా ఫారం–18ను సమర్పించాలి” అని సూచించారు.

పట్టభద్రులంతా ఓటు విలువను గుర్తించి తమ పేర్లను నమోదు చేసుకోవడంతో పాటు, తోటి పట్టభద్రులకు కూడా అవగాహన కల్పించాలని కోరారు.