హెచ్‌ఐవి /ఎయిడ్స్ సమీక్ష సమావేశం
హెచ్‌ఐవి /ఎయిడ్స్ సమీక్ష సమావేశం
ఈ రోజు అనగా 06- 10-2026 జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో జిల్లా లెప్రసి,ఎయిడ్స్ , క్షయ ఆఫీసర్ డాక్టర్ ఎస్ కె ఖాదర్ వలీ గారి అధ్యక్షతన స్థానిక నెల్లూరు బీవీ నగర్ లోని DFIT ఆఫీస్ నందు హెచ్‌ఐవి /ఎయిడ్స్ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది జిల్లా లెప్రసి ఎయిడ్స్ టీబీ ఆఫీసర్ డాక్టర్ ఖాదర్ వలీ గారు సమీక్ష నిర్వహించి నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతంగా పూర్తిచేయాలనీ ,మరింత మెరుగైన సేవలు అందించాలని ఇంకా మారుమూల కేసుల్ని గుర్తించాలని ,స్వచ్చంద సంస్థలు ఇంకా మెరుగైన సేవలు అందించాలని ,దీనికి మొబైలిజషన్ for ఎయిడ్స్ సురక్ష విధానం ద్వారా ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్లాలని సూచించారు .అనంతరం జిల్లా లోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ రక్త నిధి కేండ్రాలతో సమీక్ష నిర్వహించి జిల్లా లో రక్త సరఫరాలో ఎక్కడ లోటు లేకుండా చూడాలని నెలవారీ లక్ష్యాలను చేరుకుంటూ నివేదికలు ఆన్లైన్ లో పొందుపరచాలని 24 గంటలు అందుబాటులో ఉండాలని తెలిపారు .ఈ కార్యక్రమం లో జిల్లా ఎయిడ్స్ నివారణ విభాగం సిబ్బంది , క్షయ సిబ్బంది ,ఐసీటీసీ కౌన్సిలర్స్ ,ల్యాబ్ టెక్నిషన్స్, కళ స్టాఫ్ మరియు స్వచ్చంద సంస్థలు పాల్గొన్నారు