నూతనంగా ఎన్నికైన ఎస్ఎంసి చైర్మన్. కు ఘన సన్మానం
అనుమసముద్రంపేట మేజర్ న్యూస్ : ఏఎస్ పేట మండలం కావలి యడవల్లి గ్రామంలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల( జి.సి) నందు ఇటీవల నూతనంగా ఎస్.ఎం..సి చైర్మన్ గాఎన్నికైన కలికిరి సునీల్ ని, సభ్యులను గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు , జిల్లా తెలుగు యువత మాజీ అధ్యక్షులు ఏలూరు మాల్యాద్రి నాయుడు , గ్రామ నాయకులు మాట్లాడుతూ పాఠశాల ప్రగతికి నిరంతరం పాటుపడాలని కమిటీకి సూచించారు. పాఠశాల చైర్మన్ కలికిరి సునీల్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు