BREAKING
నూతనంగా ఎన్నికైన ఎస్ఎంసి చైర్మన్. కు ఘన సన్మానం మంత్రి లోకేష్ కు మల్లన్న ప్రసాదం అందచేత ఘనంగా కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మి జన్మదిన వేడుకలు... పట్టభద్రుల ఓటు.. ప్రజాస్వామ్యానికి బలం-డా గుండెబోయిన రమేష్ యాదవ్ ర్యాగింగ్‌కు నో చెప్పండి.. స్నేహపూర్వక వాతావరణాన్ని నిర్మిద్దాం డా. వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి మరో మూడు నూతన పేటెంట్లు. శభాష్ గాయత్రీ దివ్యాంగ భక్తుడి ఆకలి తీర్చిన ద్వారకాతిరుమల ఆలయ మహిళా సిబ్బందికి సీఎం ప్రశంస మీ సహృదయానికి అభినందనలు అంటూ ఎక్స్‌లో సీఎం పోస్ట్ శ్రీశైలంలో మహిళపై దేవస్థానం ఉద్యోగి అఘాయిత్యం..! గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారికి ఆహ్వానం పలికిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. అమెరికాలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్ మల్లన్న సన్నిధిలో ఎస్టీ కమిషన్ సభ్యుడు వెంకటప్ప భారత ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవమును పురస్కరించుకొని *సేవా సంకల్ప అభియాన్* కార్యక్రమంలో భాగంగా చింతలపూడి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో ఉచిత మెడికల్ క్యాంప్ ను ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కొందుర్గ్ మండల అధ్యక్షుడిగా మల్లని యాదయ్య గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వర్చువల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

జలసిరి నీటి కుంటల్లో గంగపుత్రులకు చేపల పెంపకానికి అవకాశం కల్పించాలి

Select Suryaa Now
జలసిరి నీటి కుంటల్లో గంగపుత్రులకు చేపల పెంపకానికి అవకాశం కల్పించాలి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట వ్యాప్తంగా జలసిరి పథకం కింద నిర్మించనున్న సుమారు 50,000 నీటి కుంటల్లో సంప్రదాయ మత్స్యకారులైన గంగపుత్రులకు చేపల పెంపకం, మత్స్యకార వృత్తి నిర్వహణకు అవకాశం కల్పించి, వారి జీవనోపాధిని మరింత మెరుగుపరచాలని తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా కోరారు.

ఈ మేరకు హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట మత్స్యశాఖ డైరెక్టర్ కార్యాలయంలో అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్. మురళీకృష్ణను కలిసి గంగపుత్ర సంఘం తరఫున వినతి పత్రం సమర్పించారు.

రాష్ట్రంలో తరతరాలుగా మత్స్యకార వృత్తినే జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్న గంగపుత్ర కుటుంబాలకు జలసిరి పథకం ద్వారా నిర్మించనున్న నీటి కుంటలు ఉపాధి అవకాశాలుగా మారేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాజేష్ ఖన్నా విజ్ఞప్తి చేశారు. నీటి కుంటల్లో చేపల పెంపకం, సంరక్షణ, వేట తదితర మత్స్యవృత్తి కార్యకలాపాల్లో సంప్రదాయ మత్స్యకారులకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు

ఈ కుంటలను స్థానిక గంగపుత్ర మత్స్యకార సంఘాలకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వారికి స్థిరమైన ఉపాధి, ఆదాయ వనరులు ఏర్పడి, వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు సంప్రదాయ మత్స్యకార వృత్తి పరిరక్షణకు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు

ప్రభుత్వం గంగపుత్రుల అభ్యర్థనను సానుకూలంగా పరిశీలించి, జలసిరి పథకంలోని నీటి కుంటల్లో చేపల పెంపకం మరియు మత్స్యకార వృత్తి నిర్వహణకు తగిన విధంగా అవకాశాలు కల్పించాలని తెలంగాణ గంగపుత్ర సంఘం తరఫున కోరారు