మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం.. పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య
ఇల్లందు రూరల్, మేజర్ న్యూస్ : మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం ఏఎంసీ చైర్మన్ బానోతు రాంబాబు అధ్యక్షతన జరిగిన పాలకవర్గ సమావేశంలో సోమవారం ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొన్నారు. 2025-26 మార్కెట్ ఆదాయ వయ్యాలపై సమీక్షించారు. మార్కెట్ పరిధిలో టేకులపల్లి సబ్ యార్డ్, మార్కెట్ కార్యాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, మార్కెట్ పరిధిలోని కామేపల్లి మండలంలో నూతన సబ్ యార్డ్ ఏర్పాటుకై సాధ్య సాధ్యాలపై చర్చించారు. ఈ సమావేశంలో పాలకవర్గం వైస్ చైర్మన్ బిజ్జా వెంకటేశ్వర్లు, సొసైటీ చైర్మన్ మెట్ల రామకృష్ణ, పాలకవర్గ సభ్యులు కుంజా వసంతరావు, జారే సమ్మక్క, బొల్లి రాజు, గుగులోతు గబ్రు, మాలోత్ బావు సింగ్, బుక్య శివలాల్ నాయక్, బానోత్ జింకు, ఓకే బుచ్చయ్య, జిగట వెంకన్న, మార్కెట్ జే ఎం ఎస్ పిక్లా నాయక్, మార్కెట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
ఇల్లందు సూర్యా రూరల్ డానియల్ అబ్బూరి