బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం న్యాయ పోరాటం: ఢిల్లీ ఏపీ భవన్‌లో మంత్రుల సంయుక్త మీడియా సమావేశం
స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తోందని స్పష్టం చేస్తూ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రులు — వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ — న్యూఢిల్లీలోని ఏపీ భవన్ గురజాడ కాన్ఫరెన్స్ హాల్‌లో సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. బలహీన వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా వారు ఉద్ఘాటించారు.