BREAKING
అంగన్వాడీ సేవలు సద్వినియోగం చేసుకోవాలి పశుగ్రాసం సాగుకు ఉపాధి హామీ పథకంలో ప్రోత్సాహం 35 కిలోల గంజాయి స్వాధీనం -ఇద్దరుఅరెస్టు ఆరవ డివిజన్‌లో నారాయణ నేత్ర జ్యోతి మహా యజ్ఞం - కొండ ప్రవీణ్ శంకర్ ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలి డిఆర్ డి ఓ సి హెచ్. శ్రీనివాస్ రావు సామాజిక అణిచివేత, ఆర్థిక దోపిడీలపై ఐక్యంగా పోరాడుదాం ప్రభుత్వాధినేతగా 25ఏళ్ళ ప్రజాసేవ పూర్తిచేసుకున్న ప్రధాని మోడీకి మంత్రి ఆనం అభినందనలు విటమిన్ డి లోపం ఉంటే శరీరంలో ఎలాంటి ప్రమాదకర సమస్యలు వస్తాయో తెలుసా? అంగన్వాడీ టీచర్ నియామకాలకు…మరో అవకాశం పెచ్చులుడుతున్న పాత పాఠశాల భవనం భయాందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు పీఎం అజయ్ కు ముత్తారం ఎంపిక అనారోగ్య బాధితుడికి ఎంఎల్‌ఏ ఎల్‌ఓసి అందచేత ఖైదీకి ప్రతిష్ఠాత్మక గోల్డ్ మెడల్ 6వ వైఎస్‌పీఏ నేషనల్ ఫెడరేషన్ కప్‌లో విశ్వసాయి విద్యార్థుల సత్తా మరోసారి పెళ్లి సందడి చేసుకోనున్న యాక్షన్ కింగ్ అర్జున్ ఇంట.. కూతురి వివాహ ముహుర్తం ఫిక్స్!

రాజరాజేశ్వరి అమ్మవారి హుండీ ఆదాయం రూ. 35.90 లక్షలు

Select Suryaa Now
రాజరాజేశ్వరి అమ్మవారి హుండీ ఆదాయం రూ. 35.90 లక్షలు

నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్   :   నెల్లూరు నగరంలోని దుర్గామిట్టలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మంగళవారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. గత 97 రోజుల కాలపరిమితికి, అనగా 2026 జూలై 02 నుండి  అక్టోబర్ 6 వరకు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా మొత్తం రూ. 35,90,534 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఇందులో సాధారణ హుండీ ద్వారా రూ. 33,83,031 రాగా, అన్నదానం హుండీ ద్వారా రూ. 2,07,503 సమకూరాయి. వీటితో పాటు విదేశీ కరెన్సీ రూపంలో 32 అమెరికా డాలర్లు, 10 కెనడా డాలర్లు కూడా హుండీలో లభించాయి.  ఈ లెక్కింపు కార్యక్రమం జిల్లా దేవాదాయ శాఖ అధికారి జనార్ధన్ రెడ్డి, కోరుటూరు గ్రూప్ ఆలయాల ఈఓ కవితల పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీధర్ నాయుడు, ఆలయ చైర్మన్ ఏలూరు శిరీష, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు, అర్చకులు పాల్గొన్నారు. వీరే కాకుండా స్టేట్ బ్యాంక్ విశ్రాంతి సిబ్బంది, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ సిబ్బంది, పోలీసు బృందం, వాలంటీర్లు, దేవస్థాన సిబ్బంది ఈ లెక్కింపు కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.