సామాజిక అణిచివేత, ఆర్థిక దోపిడీలపై ఐక్యంగా పోరాడుదాం
కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుడ్డెల రామ్మూర్తి...
మహబూబాబాద్ ప్రతినిధి,
సామాజిక అణచివేత,ఆర్థిక దోపిడీలపై ఐక్యంగా పోరాడాలని
కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుడ్డెల రామ్మూర్తి అన్నారు.బుధవారం కెవిపిఎస్ 29వ ఆవిర్భావ సందర్భంగా పట్టణంలోని పత్తిపాకలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 28 ఏళ్లలో ఎన్నో సామాజిక ప్రజా పోరాటాలు చేపట్టి అనేక విజయాలను సాధించిన సంఘంగా గుర్తింపు పొందిందని, ప్రధానంగా జస్టీస్ పున్నయ్య కమీషన్, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం, శ్మశాన వాటికల కొరకు 1235 జీవో, ఉచిత విద్యుత్ కోసం 382 జీవోలను సాధించడమే కాకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పకడ్బంది అమలు కొరకు, కులాంతర వివాహాలు చేసుకున్న జంటల రక్షణ కొరకు అనేక పోరాటాలు నిర్వహించి దళితులకు, పేదలకు భరోసా కలిగించిందని అన్నారు.దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులపై, మహిళలపై, మైనార్టీలపై కుల వివక్ష దాడులు, సాంఘిక బహిష్కరణలు, హత్యలు, అత్యాచారాలు రెట్టింపు స్థాయిలో పెరిగాయని, వీటిని అరికట్టాల్సిన పాలకులు దాడులు చేసేవారికి సహకరించడం, సన్మానాలు చేయడం దుర్మార్గమన్నారు.రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మందుల మహేందర్, వ్యకాస పట్టణ కార్యదర్శి దేవత్ హేమ నాయక్, సిఐటియు జిల్లా నాయకులు ఫులు బుజ్జ వెంకన్న ,చేపూరి గణేష్, పులిపాక నాగరాజు, ఏర్పుగొండ యాదగిరి, కర్ణ కంటి రాజు, ఎర్ర శ్రీనివాస్, నర రవి, ముత్క కుమారి, ఏరుగొండ లక్ష్మి, మహంకాళి సువార్త విజయ తదితరులు పాల్గొన్నారు.