BREAKING
నేటి పంచాంగం23 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు23 నవంబర్, 2026 కేశినేని చిన్ని ఆధ్వర్యంలో మేయర్, కార్పొరేటర్లకు ఘన సత్కారం వైభవంగా శ్రీపంచముఖ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం సర్పంచ్లకు 13, వార్డులకు 133 నామినేషన్లు జడ్పీటీసీ ఉదయ్ కుమార్ పూజలు చిన్నారి రుతిక వైద్యానికి రూ.2,20,503 విరాళం జగ్గయ్యపేటలో విజయవంతంగా సేవలందిస్తున్న బొజ్జా డెంటల్ సాంప్రదాయంగా తులసి దామోదర కళ్యాణం ఘనంగా యుటిఎఫ్ ఎన్టీఆర్ జిల్లా .. 5వ కౌన్సిల్ సమావేశాలు ఆప్యాయ పలకరింపులతో ఓటర్లను ఆకట్టుకుంటున్న మోదుగుముడి వెంకటేశ్వరరావు. నేడు మున్సిపల్ చైర్మన్, కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారం గూడవల్లి సర్పంచ్‌గా నెరుసు నీల మణిఈశ్వరరావు (నిఖిల్) ఏకగ్రీవ ఎన్నిక.. తాడిగడప 13వ వార్డులో బోడే ప్రసాద్ ఎన్నికల ప్రచారం అవనిగడ్డ మండలంలో రెండో రోజు కోలాహలంగా నామినేషన్లు

రజక సంఘం నూతన కమిటీ ఎన్నిక

Select Suryaa Now
రజక సంఘం నూతన కమిటీ ఎన్నిక

 

మండల అధ్యక్షుడిగా జంగాపల్లి తిరుపతి, కార్యదర్శిగా కనుకుల శంకర్

మహా ముత్తారం, 
రజకుల హక్కులు, సంక్షేమం, సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం తెలంగాణ రజక సంఘం నిరంతరం పోరాడుతుందని ఆ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు అయిత బాపు తెలిపారు.బుధవారం మహా ముత్తారం మండలం యామనపల్లి గ్రామంలో జిల్లా అధ్యక్షుడు అయిత బాపు ఆధ్వర్యంలో మహా ముత్తారం మండల రజక సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా జంగాపల్లి తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా కనుకుల శంకర్ ఏకగ్రీవంగా నియమితులయ్యారు.
ఈ సందర్భంగా అయిత బాపు మాట్లాడుతూ రజకుల సమస్యల పరిష్కారం కోసం మండల స్థాయిలో సంఘటితంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన మండల కమిటీ సభ్యులు రజకుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేయాలని ఆయన సూచించారు. రజక సంఘాన్ని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసి, ఐక్యతతో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా కుల సంఘాల జేఏసీ చైర్మన్ పీక కిరణ్, సంఘం నాయకులు పాల్గొన్నారు