ప్రభుత్వ వైద్యశాలకు ఆరుగురు వైద్యులు నియామకం
రేపల్లె, మేజర్ న్యూస్;
రేపల్లె ప్రభుత్వ వైద్యశాలలో జనరల్ మెడిసిన్ జనరల్ సర్జన్ గైనకాలజిస్ట్ పిల్లల వైద్యులతో పాటు ప్రత్యేకంగా డాక్టర్ పి సందీప్ (మానసిక వైద్యులు) డాక్టర్ పి స్రవంతి (ఈఎన్టి) డాక్టర్ బాలసుధ (డెర్మటాలజీ ) డాక్టర్ విక్టర్ పాల్ (ఆర్థమాలజీ) డాక్టర్ పి హనుమంతరావు (ఆర్థోపెడిక్) డాక్టర్ పి యామినిప్రియ లను కేటాయించిన ట్లు వైద్యశాల సూపరిండెంట్ డాక్టర్ పృథ్వి గణేష్ బుధవారం తెలిపారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీర ప్రాంతంలో అత్యవసర పరిస్థితులలో తెనాలి గుంటూరు వైద్యశాలలకు రోగులను తరలించకుండా అన్ని సౌకర్యాలతో ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందించాలని దృఢ సంకల్పంతో ఖాళీగా ఉన్న వివిధ విభాగాలలో వైద్యులను నియమించారని తెలిపారు. ప్రతిరోజు అందుబాటులో వుండే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, పిల్లల వైద్యులతోపాటు, ప్రత్యేకంగా సైకియ్యాట్రి (మానసిక వైద్యులు ), చర్మ వైద్యులు, ఆర్థోపెడిక్ వైద్యులు, చెవి ముక్కు గొంతు వైద్యులు, కంటి వైద్యులు అందుబాటులో ఉంటారని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని డాక్టర్ పృథ్వి గణేష్. కోరారు