BREAKING
క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తుంకుంటఆంక్ష రెడ్డి గజ్వేల్ మండలం టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా నడిగప్పుల నాగరాజు ఇంటింటి సర్వేతో టీబీకి చెక్‌.. సంగాయిపల్లికి గుర్తింపు స్క్రాప్ దుకాణంలో.. కత్తితో బెదిరించి దోపిడి మెదక్‌లో సరికొత్త అభివృద్ధి శకం! సూర్య కొత్త సినిమాలో క్రేజీ సాంగ్.. పోలీస్ పాత్రలో మరోసారి అదరగొట్టనున్న హీరో అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయొద్దు బుచ్చయ్యపేటలో టిడిపికి భారీ షాక్ మల్లం టిడిపి నుంచి వైసీపీ లోకి భారీ చేరికలు నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్ నగర్ లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ స్థానిక సంస్థల ఎన్నికలపై ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ లక్కీ ఫ్యాషన్ షోరూంలో లిఫ్ట్‌లో చిన్నారులకు నరకయాతన..! త్వరలోనే కొత్త పెన్షన్లు అందజేస్తాం.. పేదల సొంతింటి కల నెరవేరుస్తాం-వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు పాఠశాల, ఆలయం సమీపంలో మద్యం దుకాణం రద్దు చేయండి: ఎక్సైజ్ అధికారులకు గ్రామస్థుల వినతి గుప్త నిధుల కోసం ఇంట్లో తవ్వకాలు…

మరిపెడలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

Select Suryaa Now
మరిపెడలో ఉచిత నేత్ర వైద్య శిబిరం


మరిపెడ ప్రతినిధి, మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో బుధవారం ఖమ్మం శారద కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ ప్రజలకు కంటి ఆరోగ్యంపై అవగాహన  కలగి ఉండాలన్నారు.శారద కంటి వైద్యశాల వైద్యులు ప్రజలకు నేత్ర సంరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు, అవసరమైన వారికి ఉచితంగా కంటి పరీక్షలు, వైద్య సలహాలు అందించడం అభినందనీయమన్నారు. ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
శిబిరంలో స్థానిక ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి వైద్యుల సూచనలు, కంటి అద్దాలు అందించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని నిర్వాహకులను అభినందించారు.కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యులు షేక్ సలీమా తాజోద్దీన్,షేక్ అజీజ్, బాషిత్ ఖాన్,బాషిపంగు ఇద్దయ్య,కిరణ్, వికాస్, వీరభద్రం,రాకేష్, శివ, శ్రీకాంత్, రాజు, రాజా స్వామి తదితరులు పాల్గొన్నారు.