BREAKING
తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటానా? స్పందించిన ది రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ మోసాలకు కేంద్రం చెక్ :కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి! నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ ఆర్టీసీ ఎన్నికల్లో దూసుకుపోయిన బాణం నారాయణపేట డిపోలో కూటమికి మెజార్టీ రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జీర్ణక్రియ సజావుగా సాగేలా పాటించాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు హోప్ శతకం, రూథర్‌ఫోర్డ్ విధ్వంసం – 249 పరుగులు చేసినా భారత్‌కు తప్పని ఓటమి మానసిక ప్రశాంతత కోసం రోజువారీ జీవితంలో పాటించాల్సిన సులువైన మార్పులు ఇవే నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు! భారత్ గుండెల్లో ఆఫ్రికా: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ! ఘనంగా ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేట్ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకలు రోజంతా సరిపడా నీళ్లు తాగకపోతే శరీరంలో జరిగే అనర్థాలు ఇవే.. డీహైడ్రేషన్ లక్షణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

త్వరలోనే కొత్త పెన్షన్లు అందజేస్తాం.. పేదల సొంతింటి కల నెరవేరుస్తాం-వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

Select Suryaa Now
త్వరలోనే కొత్త పెన్షన్లు అందజేస్తాం..  పేదల సొంతింటి కల నెరవేరుస్తాం-వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

నెల్లూరు, మేజర్ న్యూస్ :
గత వైసీపీ ప్రభుత్వం ఒట్టి మాటల ప్రభుత్వమని.. కోవూరు నియోజకవర్గంలో ఎక్కడా తట్టెడు మట్టి కూడా వేసిన పాపాన పోలేదని కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు విమర్శించారు. పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా గురువారం కోవూరు మండలం, పడుగుపాడు గ్రామంలో పర్యటించారు. రూ.20 లక్షలతో చేపట్టనున్న 4 సీసీ రోడ్ల నిర్మాణానికి స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. అలాగే, మరో రూ.20 లక్షలతో నిర్మించిన విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేజ్‌ క్లినిక్‌ ఆవరణలో మొక్కలు నాటారు. స్థానిక నాయకులతో కలిసి గ్రామంలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు.

గత ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధులు నియోజకవర్గంలో అభివృద్ధిని పక్కన పెట్టి మాటలకే పరిమితమయ్యారని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు విమర్శించారు. నిధులు లేవన్న సాకుతో గ్రామీణ పేదలకు వైద్యం అందించే విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ పనులను అర్ధాంతరంగా నిలిపివేశారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రూ.20 లక్షల నిధులను తిరిగి మంజూరు చేయించి పనులు పూర్తి చేశామని తెలిపారు. గత ప్రభుత్వంలా తమది మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమని చెప్పారు. టెంకాయలు కొట్టి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడమే కాకుండా గుమ్మడికాయలు కొట్టి ప్రారంభోత్సవాలు కూడా చేస్తున్నామని తెలిపారు.

సీఎం, డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తోందని కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు అన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ గారు పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య తేడా లేకుండా అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు.

త్వరలోనే షుగర్‌ ఫ్యాక్టరీ కార్మికులకు వేతన బకాయిల చెల్లింపు
పడుగుపాడు నడిబొడ్డున ఏర్పాటు చేసిన ఎంఎస్‌ఎంఈ పార్కు వల్ల భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు జరుగుతుందని.. యువత, మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు చెప్పారు. కోవూరులో 13 సంవత్సరాలుగా మూతపడి ఉన్న షుగర్‌ ఫ్యాక్టరీ కార్మికుల వేతన బకాయిల సమస్యను సీఎం చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించామని గుర్తుచేశారు. ఇటీవలే దీనికి సంబంధించిన జీవో ప్రభుత్వం జారీ చేసిందని.. త్వరలోనే కార్మికులకు బకాయిలు చెల్లిస్తామని పేర్కొన్నారు.

కొత్త పెన్షన్లు, సొంతింటి కల సాకారం చేస్తాం
ప్రతి ఇంటి నుంచి6 పారిశ్రామికవేత్తలు రావాలన్నదే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ గారి లక్ష్యమని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు చెప్పారు. కోవూరు నియోజకవర్గంలో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు మంచి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, కొత్త పెన్షన్లు, సొంతింటి కలను త్వరలోనే సాకారం చేస్తామని హామీ ఇచ్చారు.

కూటమి నాయకులందరూ కలిసికట్టుగా పనిచేయాలి
కూటమి నాయకులందరూ తమ సోదర సమానులని.. ప్రజల కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించాలని కోరారు. నియోజకవర్గంలో గ్రామగ్రామాన కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు చూపించి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడగాలన్నా