స్థానిక సంస్థల ఎన్నికలపై ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్
ఏలూరు, : అమరావతిలోని ఏపీ ఎలక్షన్ కమీషన్ కార్యాలయం నుంచి గురువారం స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్ లు, ఎస్పీలు, ఆయా శాఖల జిల్లా అధికారులతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలెక్షన్ కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ మాట్లాడుతూ ప్రతి జిల్లాలో వార్డుల వారీగా, పంచాయతీల వారీగా తుది ఓటర్ల జాబితాలను లోపాలు లేకుండా సిద్ధం చేయాలని కలెక్టర్లకు సూచించారు.సమస్యాత్మక , అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అక్కడ అవసరమైన అదనపు భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీలను ఆదేశించారు.ఏలూరు కలెక్టరేట్ నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను స్టేట్ ఎలెక్షన్ కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ కు తెలియజేసారు.
న్యూస్ బ్యూరో కే బాలసౌరి, ఏలూరు