నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్ నగర్ లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
నెల్లూరు, మేజర్ న్యూస్ : నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్ నగర్ రాజీవ్ గాంధీ కాలనీలో విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
30 ద్విచక్ర వాహనాలు, ఒక కారు, ఒక ఆటో స్వాధీనం – నెల్లూరు టౌన్ దీక్ష IPS గారి ఆధ్వర్యంలో ఆపరేషన్ త్రిశూల్‌పై ప్రజలకు అవగాహన
SPSR నెల్లూరు జిల్లాలో నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి, ప్రజల భద్రతను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS గారి ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు, విస్తృత తనిఖీలు మరియు ప్రజా అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో 08.10.2026న నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్ నగర్ రాజీవ్ గాంధీ కాలనీలో నవాబుపేట సబ్ ఇన్‌స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
ఈ ఆపరేషన్‌లో నవాబుపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్‌తో పాటు మొత్తం 40 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందం, టీమ్‌తో కలిసి పాల్గొంది.
విస్తృతంగా తనిఖీలు – వాహనాలు స్వాధీనం
కార్డన్ అండ్ సెర్చ్‌లో భాగంగా కిసాన్ నగర్ రాజీవ్ గాంధీ కాలనీలోని ఇళ్లు, పరిసర ప్రాంతాలు, అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా సరైన ఆధార పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, ఒక కారు, ఒక ఆటోను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్, యాజమాన్య హక్కులు మరియు ఇతర పత్రాలను పోలీసులు తదుపరి పరిశీలిస్తున్నారు.
కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ద్వారా నేరాలకు పాల్పడే వ్యక్తుల కదలికలను గుర్తించడం, అనుమానాస్పద కార్యకలాపాలను అరికట్టడం, అక్రమంగా వినియోగిస్తున్న వాహనాలను గుర్తించడం, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం వంటి చర్యలు చేపట్టారు.
ఆపరేషన్ త్రిశూల్‌పై ప్రజలకు అవగాహన
కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ అనంతరం ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలతో నెల్లూరు టౌన్ శ్రీమతి దీక్ష, IPS గారు ప్రత్యేకంగా సమావేశమై ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమం ఉద్దేశాలు, లక్ష్యాలు మరియు ప్రజల భాగస్వామ్యం గురించి అవగాహన కల్పించారు.
నేరాల నియంత్రణ కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రజల సహకారం మరియు అప్రమత్తతతోనే నేరరహిత సమాజాన్ని నిర్మించగలమని ఆమె వివరించారు. తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు, అనుమానాస్పద వాహనాలు లేదా అసాంఘిక కార్యకలాపాలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తుల కదలికలపై నిఘా, అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహనాల తనిఖీ, అక్రమ కార్యకలాపాల నియంత్రణ, ప్రజల భద్రతకు ముప్పుగా పరిణమించే అంశాల గుర్తింపు వంటి చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
అదేవిధంగా మహిళలు మరియు బాలల భద్రతచట్టం, బాల్య వివాహాల నిరోధం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, రోడ్డు భద్రత, హెల్మెట్ వినియోగం తదితర అంశాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించారు.
ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా, తమ పరిసరాల్లో జరుగుతున్న అనుమానాస్పద కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను సంప్రదించాలని సూచించారు.
నేరాల నియంత్రణే లక్ష్యం
నెల్లూరు జిల్లాలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు, ఆపరేషన్ త్రిశూల్,టీమ్ తనిఖీలు మరియు ప్రజా అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.
చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని, ప్రజల భద్రత విషయంలో జిల్లా పోలీసు శాఖ రాజీపడదని స్పష్టం చేశారు.