BREAKING
మాజీ మంత్రి బాలినేని ని కలిసిన గర్భం మూవీ హీరోయిన్ లక్షా మార్కాపురంలో ఆధార్ కేంద్రాలపై తహసీల్దార్ కె.చిరంజీవి ఆకస్మిక తనిఖీలు ప్రభుత్వ వైద్యశాలకు ఆరుగురు వైద్యులు నియామకం పల్లె పండుగ లో భాగంగా అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ, జిల్లా కలెక్టర్ గనియ రాజకుమారి కూటమి ప్రభుత్వం పరిపాలనపై ప్రజా అభిప్రాయ సేకరణ.. స్త్రీనిధి రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి శాంతి భద్రతల పరిరక్షణలో ఉపేక్షించేది లేదు - డిఎస్‌పి కొడకండ్ల ప్రెస్ క్లబ్ కు నూతన కార్యవర్గం ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఎస్సై శ్రీశైలం పై చర్యలు తీసుకోవాలి కోళ్లఫారం ప్రారంభంలో టిడిపి నాయకులు రజక సంఘం నూతన కమిటీ ఎన్నిక ఆత్మకూరులో తెలుగుదేశం యూనిట్ సమావేశం సి జి ఎఫ్ నిధులతో ఆలయాల అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి-- మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్ఎస్‌యూఐ నాయకులపై దాడి పిరికిపంద చర్య మరిపెడలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

ఎన్ఎస్‌యూఐ నాయకులపై దాడి పిరికిపంద చర్య

Select Suryaa Now
ఎన్ఎస్‌యూఐ నాయకులపై దాడి పిరికిపంద చర్య

ఎన్ఎస్‌యూఐ నాయకులపై దాడి పిరికిపంద చర్య

బీజేపీది సంకల్పయాత్ర కాదు.. శవ రాజకీయ యాత్ర

దాడులు చేస్తే ప్రతిదాడులకు దిగుతాం: కాంగ్రెస్ నేతల హెచ్చరిక

సిద్దిపేట అర్బన్  :సిద్దిపేటలో ఎన్ఎస్‌యూఐ నాయకులపై బీజేపీ నాయకులు దాడి చేయడం పిరికిపంద చర్య అని సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పూజల హరికృష్ణ, సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు ఇమామ్ మండిపడ్డారు. ఎన్ఎస్‌యూఐ నాయకులపై దాడికి పాల్పడిన వారిని పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.సిద్దిపేటలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ, ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా నిరసనలు చేపడుతోందన్నారు. ఈ క్రమంలో సిద్దిపేట గాంధీ చౌరస్తా వద్ద ఎన్ఎస్‌యూఐ నాయకులు నిరసన వ్యక్తం చేస్తుండగా, అదే సమయంలో అక్కడికి వచ్చిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు వారిపై దాడికి పాల్పడటం సిగ్గుచేటని ఆరోపించారు.శాంతియుత నిరసనలపై దాడులు చేయడమే బీజేపీ సంస్కృతా? అని ప్రశ్నించారు. మహిళా నాయకులపైనా దాడి చేయడం మరింత బాధాకరమన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక దాడులకు పాల్పడటం బీజేపీ నాయకుల పిరికితనానికి నిదర్శనమని విమర్శించారు.సిద్దిపేటలో రాజకీయ ఉనికి కోసం బీజేపీ ‘సంకల్పయాత్ర’ పేరుతో శవ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. దేశంలో ప్రజలు, ముఖ్యంగా యువత నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఇతర సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యాత్రల పేరుతో కాలక్షేపం చేస్తోందని విమర్శించారు.బీజేపీ నాయకులు దాడులకు పాల్పడితే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. “మీరు దాడులు చేస్తే.. ప్రతిదాడులకు దిగుతాం” అంటూ హెచ్చరిక చేశారు. మరోసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు.ఎన్ఎస్‌యూఐ నాయకులపై దాడికి పాల్పడిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కాలం చెల్లిందని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి తగిన సమాధానం చెబుతారని అన్నారు.ఈ సమావేశంలో ఎన్ఎస్‌యూఐ నాయకులు అజ్మత్ దాస్, అంజయ్య, బిక్షపతి, హర్ష, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.