BREAKING
అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా శ్రీ మహాలక్ష్మి మాత పూజలు - హోమం & దీపావళి వేడుకలు 20 మంది ఉద్యోగులకు రూ. 20 లక్షల దీపావళి బోనస్ ఇచ్చిన సూరత్ వ్యాపారి దీపావళి వేడుకల విచ్ఛిన్నంపై అమెరికా ఎంపీ ఆగ్రహం కేంబ్రిడ్జ్ కమ్యూనిటీ క్రీడా పోటీలు – 2026లో అద్విత విద్యార్థుల అద్భుత ప్రతిభ! 11 పతకాలతో క్రీడా విజయకేతనం! బస్తర్ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి: నక్సలిజం రహిత తొలి పండుగ ఎల్ఏ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత: ఇద్దరి నిర్బంధం, నిత్య రామన్ ఖండన దీపావళి వేళ ఢిల్లీలో విష పొగమంచు.. 383కి పడిపోయిన ఏక్యూఐ పండుగల రద్దీకి పకడ్బందీ ఏర్పాట్లు: రైల్వే మంత్రి న్యూజెర్సీ ఇంట్లో ముగ్గురు విగతజీవులుగా లభ్యం ప్రపంచ నేతల దీపావళి శుభాకాంక్షలు: శాంతి, సామరస్యానికి పిలుపు రోడ్డుపై విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్: పికప్ ట్రక్కును ఢీకొన్న దృశ్యాలు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ ను కలిసిన రామగిరి నూతన జడ్పీటీసీ బైనేని శిరీష .. 17 ఎంపీటీసీ స్థానాల్లో ప్రశాంత ఎన్నికలు.. ఫలితాల రోజు వరకు పటిష్ట బందోబస్తు.. ఎస్‌ఐ రవికుమార్‌కు ఎంపీటీసీల అభినందనలు!...ఎన్నికల కోడ్ నుంచి ఫలితాల ప్రకటన వరకు అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసుల నిఘా..... కొడంగల్ నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నేడు స్టాక్ మార్కెట్ సంవత్ 2083 ముహూర్త్ ట్రేడింగ్

పల్లె పండుగ లో భాగంగా అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ, జిల్లా కలెక్టర్ గనియ రాజకుమారి

Select Suryaa Now
పల్లె పండుగ లో భాగంగా అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ, జిల్లా కలెక్టర్ గనియ రాజకుమారి

పల్లె పండుగ 3.0తో గ్రామాల్లో అభివృద్ధి పనులు
ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ, జిల్లా కలెక్టర్ రాజకుమారి 
*ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చొరవతో మౌలిక వసతులకు నిధులు
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్
మండలంలోనిజి .జమ్మలదిన్నె మరియు కోట కందుకూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులను బుధవారం  ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు ,జిల్లా కలెక్టర్ రాజకుమారి  తో కలిసి ప్రారంభించారు.ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారితో సమన్వయం చేస్తూ అవసరమైన నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.

ఆళ్లగడ్డ మండలం జంబులదిన్నె గ్రామంలో ముస్లిం, ఎస్సీ స్మశాన వాటికలకు వెళ్లే మార్గంలో చిన్న ఏరు దాటేందుకు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను  ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన కలెక్టర్ రూ.60 లక్షలతో కల్వర్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా, పనులు పూర్తిచేసి బుధవారం ప్రారంభించారు.పల్లె పండుగ 3.0లో భాగంగా G జంబులదిన్నె గ్రామంలో మరో రూ.20 లక్షల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కాగా, ఇప్పటికే పల్లె పండుగ 1.0, 2.0 కింద చేపట్టిన పనులతో కలిపి గ్రామంలో సుమారు రూ.95 లక్షల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. ఇలాంటి సమస్యలు ఉన్న మరో 14 ప్రాంతాల్లో కల్వర్టుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి పనులు చేపట్టేలా చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు.కోటకందుకూరు గ్రామంలో కూడా పల్లె పండుగ 3.0లో భాగంగా రూ.40 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి కలెక్టర్ తో కలిసి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భూమిపూజ నిర్వహించారు. గ్రామంలో ప్రజలకు అవసరమైన మరిన్ని అభివృద్ధి పనులను గుర్తించి నిధులు మంజూరు చేయించేలా అధికారులతో సమన్వయం చేస్తామని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఈ సందర్భంగా తెలిపారు.ప్రజా సమస్యల పరిష్కార వేదిక  ద్వారా ప్రజలు తెలియజేస్తున్న సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. పల్లె పండుగ 3.0 ద్వారా గ్రామాల్లో రహదారులు, కల్వర్టులు, డ్రైనేజీ తదితర మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు.ప్రజా సమస్యల పరిష్కారానికి స్పందించి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్న జిల్లా కలెక్టర్ జి. రాజకుమారికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కృతజ్ఞతలు తెలిపారు.