BREAKING
మాజీ మంత్రి బాలినేని ని కలిసిన గర్భం మూవీ హీరోయిన్ లక్షా మార్కాపురంలో ఆధార్ కేంద్రాలపై తహసీల్దార్ కె.చిరంజీవి ఆకస్మిక తనిఖీలు ప్రభుత్వ వైద్యశాలకు ఆరుగురు వైద్యులు నియామకం పల్లె పండుగ లో భాగంగా అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ, జిల్లా కలెక్టర్ గనియ రాజకుమారి కూటమి ప్రభుత్వం పరిపాలనపై ప్రజా అభిప్రాయ సేకరణ.. స్త్రీనిధి రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి శాంతి భద్రతల పరిరక్షణలో ఉపేక్షించేది లేదు - డిఎస్‌పి కొడకండ్ల ప్రెస్ క్లబ్ కు నూతన కార్యవర్గం ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఎస్సై శ్రీశైలం పై చర్యలు తీసుకోవాలి కోళ్లఫారం ప్రారంభంలో టిడిపి నాయకులు రజక సంఘం నూతన కమిటీ ఎన్నిక ఆత్మకూరులో తెలుగుదేశం యూనిట్ సమావేశం సి జి ఎఫ్ నిధులతో ఆలయాల అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి-- మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్ఎస్‌యూఐ నాయకులపై దాడి పిరికిపంద చర్య మరిపెడలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఎస్సై పై చర్యలు తీసుకోవాలి

Select Suryaa Now
ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఎస్సై పై చర్యలు తీసుకోవాలి

ఏకపక్షంగా వ్యవహరిస్తున్న శంకర్ పల్లి ఎస్సై శ్రీశైలంపై చర్యలు తీసుకోవాలని  ఆలంఖాన్ గూడ గ్రామస్తుడు మహేందర్  పేర్కొన్నారు. బుధవారం రోజున గ్రామస్తులతో కలిసి  శంకర్పల్లి లో విలేకరులతో మాట్లాడుతూ…  మంగళవారం రాత్రి భోజిరెడ్డి ఇంటి ముందుగల అరుగుపై  తాను భోజిరెడ్డితో మాట్లాడుతుండగా, గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు వచ్చి తమపై దాడి చేశారని  తెలిపారు. రాత్రి శంకర్పల్లి పోలీస్ స్టేషన్ లో  దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేశామనీ వాపోయారు. ఇచ్చిన ఫిర్యాదు గురించి తెలుసుకునేందుకు బుధవారం ఉదయం శంకర్పల్లి పోలీస్ స్టేషన్ కు తాను భోజ రెడ్డితో కలిసి రాగ, ఎస్సై శ్రీశైలం భోజిరెడ్డిని అకారణంగా ఈడ్చుకుంటూ వెళ్లి సెల్లో వేశారని తెలిపారు. గ్రామానికి వచ్చి ఎలాంటి విచారణ చేయకుండా, సెల్లో  ఎలా వేశారని ప్రశ్నించారు.  ఉన్నతాధికారులు జరిగిన సంఘటనపై  తగిన విచారణ జరిపించి  న్యాయం చేయాలని  ఆయన కోరారు. పలుకుబడి కలిగిన వ్యక్తులకు ఆయన అండగా ఉంటారని, సామాన్య ప్రజలను పట్టించుకోకుండా, న్యాయం కోసం పోరాటం చేస్తున్న వ్యక్తులను ఎస్సై పట్టించుకోరని ఆయన తెలిపారు.

- మాడిశెట్టి రాజ శేఖర్, మేజర్ న్యూస్, శంకర్ పల్లి.