BREAKING
మన్యప్రాణాలను కాపాడటం అందరి బాధ్యత ఓటీటీలో రాధికా ఆప్టే హారర్ థ్రిల్లర్.. వీకెండ్‌కు అదిరిపోయే మూవీ ట్రోలింగ్‌పై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు.. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గించుకోను అంటూ స్ట్రాంగ్ కౌంటర్ క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తుంకుంటఆంక్ష రెడ్డి గజ్వేల్ మండలం టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా నడిగప్పుల నాగరాజు ఇంటింటి సర్వేతో టీబీకి చెక్‌.. సంగాయిపల్లికి గుర్తింపు స్క్రాప్ దుకాణంలో.. కత్తితో బెదిరించి దోపిడి మెదక్‌లో సరికొత్త అభివృద్ధి శకం! సూర్య కొత్త సినిమాలో క్రేజీ సాంగ్.. పోలీస్ పాత్రలో మరోసారి అదరగొట్టనున్న హీరో అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయొద్దు బుచ్చయ్యపేటలో టిడిపికి భారీ షాక్ మల్లం టిడిపి నుంచి వైసీపీ లోకి భారీ చేరికలు నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్ నగర్ లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ స్థానిక సంస్థల ఎన్నికలపై ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ లక్కీ ఫ్యాషన్ షోరూంలో లిఫ్ట్‌లో చిన్నారులకు నరకయాతన..! త్వరలోనే కొత్త పెన్షన్లు అందజేస్తాం.. పేదల సొంతింటి కల నెరవేరుస్తాం-వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

కొడకండ్ల ప్రెస్ క్లబ్ కు నూతన కార్యవర్గం

Select Suryaa Now
కొడకండ్ల ప్రెస్ క్లబ్ కు నూతన కార్యవర్గం

 

అధ్యక్షుడిగా నేతి ఉపేందర్

కొడకండ్ల ప్రతినిధి

కొడకండ్ల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జర్నలిస్టుల ఐక్యత, వృత్తి విలువల పరిరక్షణ, ప్రజా సమస్యలను సమాజం దృష్టికి తీసుకెళ్లే దిశగా ప్రెస్ క్లబ్ మరింత సమర్థవంతంగా పనిచేయాలని నూతన కార్యవర్గం సంకల్పించింది.

నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా నేతి ఉపేందర్, గౌరవ అధ్యక్షుడిగా వెంకన్న శర్మ, ప్రధాన కార్యదర్శిగా ధారవత్ అశోక్ నాయక్, ఉపాధ్యక్షుడిగా రెహమాన్, కోశాధికారిగా శ్రీనివాస్, సహాయక కార్యదర్శిగా విరదాసు నవీన్ కుమార్ ఎన్నికయ్యారు.

సలహాదారులుగా..

ప్రెస్ క్లబ్‌కు సలహాదారులుగా నర్మేట శేఖర్, ఏ. కృష్ణ శర్మ, పి. దక్షిణామూర్తి, బాల్నే వెంకన్న, దండేపల్లి శ్రీనివాస్, ఎం. సోమేశ్వర్, డి. నాగరాజు, వి. రఘునందన్, పొన్నం వెంకన్న, శ్రావణ్, నాగేష్ వ్యవహరించనున్నారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు నేతి ఉపేందర్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేయడంతో పాటు, కొడకండ్ల ప్రాంతంలోని ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో ప్రెస్ క్లబ్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. జర్నలిస్టుల మధ్య ఐక్యతను బలోపేతం చేస్తూ, వృత్తి నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా మీడియా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించేలా నూతన కార్యవర్గం పనిచేస్తుందని తెలిపారు. నూతన కార్యవర్గానికి పలువురు జర్నలిస్టులు, వివిధ వర్గాల ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.