BREAKING
మాజీ మంత్రి బాలినేని ని కలిసిన గర్భం మూవీ హీరోయిన్ లక్షా మార్కాపురంలో ఆధార్ కేంద్రాలపై తహసీల్దార్ కె.చిరంజీవి ఆకస్మిక తనిఖీలు ప్రభుత్వ వైద్యశాలకు ఆరుగురు వైద్యులు నియామకం పల్లె పండుగ లో భాగంగా అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ, జిల్లా కలెక్టర్ గనియ రాజకుమారి కూటమి ప్రభుత్వం పరిపాలనపై ప్రజా అభిప్రాయ సేకరణ.. స్త్రీనిధి రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి శాంతి భద్రతల పరిరక్షణలో ఉపేక్షించేది లేదు - డిఎస్‌పి కొడకండ్ల ప్రెస్ క్లబ్ కు నూతన కార్యవర్గం ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఎస్సై శ్రీశైలం పై చర్యలు తీసుకోవాలి కోళ్లఫారం ప్రారంభంలో టిడిపి నాయకులు రజక సంఘం నూతన కమిటీ ఎన్నిక ఆత్మకూరులో తెలుగుదేశం యూనిట్ సమావేశం సి జి ఎఫ్ నిధులతో ఆలయాల అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి-- మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్ఎస్‌యూఐ నాయకులపై దాడి పిరికిపంద చర్య మరిపెడలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

6వ వైఎస్‌పీఏ నేషనల్ ఫెడరేషన్ కప్‌లో విశ్వసాయి విద్యార్థుల సత్తా

Select Suryaa Now
6వ వైఎస్‌పీఏ నేషనల్ ఫెడరేషన్ కప్‌లో విశ్వసాయి విద్యార్థుల సత్తా

నెల్లూరు, అర్బన్/క్రైమ్ (మేజర్ న్యూస్):
6వ వైఎస్‌పీఏ నేషనల్ ఫెడరేషన్ కప్‌–2026లో నెల్లూరులోని విశ్వసాయి జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. జాతీయ స్థాయి పోటీల్లో ప్రథమ స్థానాన్ని సాధించి కళాశాలకు, నెల్లూరు జిల్లాకు గర్వకారణంగా నిలిచారు.జూలై 11, 12 తేదీల్లో నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన స్టేట్ సెలక్షన్స్‌లో ప్రతిభ కనబరిచిన విశ్వసాయి విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 29, 30 తేదీల్లో గోవాలో జరిగిన 6వ వైఎస్‌పీఏ నేషనల్ ఫెడరేషన్ కప్–2026లో విద్యార్థులు పాల్గొని అద్భుత ప్రతిభ కనబరిచారు.క్రికెట్ విభాగంలో డి. భవన్, వి. హర్షిత్, ఎం. రిషి, ఎం. మోహనకృష్ణ ప్రథమ స్థానం సాధించగా, ఎ. కార్తీక్, ఎన్. చరణ్ కూడా తమ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు కళాశాల యాజమాన్యం వెల్లడించింది.విద్యార్థుల విజయంపై కళాశాల చైర్మన్ డా. యన్. సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం అభినందనీయమన్నారు.క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలిపారు.డిసెంబర్ రెండో వారంలో భూటాన్‌లో జరగనున్న అంతర్జాతీయ సెలక్షన్స్‌కు విద్యార్థులు ఎంపిక కావడం విశ్వసాయి కళాశాలకు మరింత గర్వకారణమని చైర్మన్ తెలిపారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన అధ్యాపకులు, శిక్షకులను అభినందించారు.