ప్రభుత్వాధినేతగా 25ఏళ్ళ ప్రజాసేవ పూర్తిచేసుకున్న ప్రధాని మోడీకి మంత్రి ఆనం అభినందనలు
ప్రభుత్వాధినేతగా 25 ఏళ్ల ప్రజాసేవ పూర్తి చేసుకున్న ప్రధాని మోదీకి మంత్రి ఆనం అభినందనలు
ఆత్మకూరు, మేజర్ న్యూస్, సోమ వెంకటసుబ్బయ్య : ప్రభుత్వాధినేతగా 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన మోదీ ప్రజాసేవా ప్రస్థానం దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి దేశాభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన దిశగా కొనసాగుతున్న సుదీర్ఘ ప్రయాణానికి నిదర్శనమని మంత్రి ఆనం పేర్కొన్నారు.
ప్రజల విశ్వాసాన్ని కేంద్రంగా చేసుకుని, క్రమశిక్షణతో కూడిన పాలన, దేశాభివృద్ధి పట్ల నిరంతర నిబద్ధతతో ముందుకు సాగడం మోదీ నాయకత్వ ప్రస్థానంలో ప్రత్యేకతను సంతరించుకుందని అన్నారు.రైతు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతు కుటుంబాలకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందించడం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించేలా జన్‌ధన్ యోజన, వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేర్చే ప్రత్యక్ష నగదు బదిలీ వ్యవస్థ వంటి చర్యలు ప్రజా సంక్షేమంలో కీలకమైన మార్పులకు దోహదపడ్డాయని మంత్రి ఆనం అన్నారు.గ్రామీణ భారతం నుంచి పట్టణ భారతం వరకు అభివృద్ధి ఫలాలు ప్రతి వర్గానికీ చేరేలా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు దేశ ప్రగతిలో కొత్త దిశను చూపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.దేశాన్ని అభివృద్ధి చెందిన భారతదేశంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రధాని మోదీ మరింత ఉత్సాహంతో, సంపూర్ణ ఆరోగ్యంతో, ప్రజల ఆశీస్సులతో మరెన్నో సంవత్సరాలు దేశానికి సేవలందించాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆకాంక్షించారు.దేశ సేవకు అంకితమైన 25 ఏళ్ల ప్రస్థానం మరింత స్ఫూర్తిదాయకంగా కొనసాగాలని, భారతదేశ ప్రగతి పథంలో ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం మరిన్ని విజయాలను సాధించాలని మంత్రి ఆనం ఆకాంక్షించారు.