BREAKING
మాజీ మంత్రి బాలినేని ని కలిసిన గర్భం మూవీ హీరోయిన్ లక్షా మార్కాపురంలో ఆధార్ కేంద్రాలపై తహసీల్దార్ కె.చిరంజీవి ఆకస్మిక తనిఖీలు ప్రభుత్వ వైద్యశాలకు ఆరుగురు వైద్యులు నియామకం పల్లె పండుగ లో భాగంగా అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ, జిల్లా కలెక్టర్ గనియ రాజకుమారి కూటమి ప్రభుత్వం పరిపాలనపై ప్రజా అభిప్రాయ సేకరణ.. స్త్రీనిధి రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి శాంతి భద్రతల పరిరక్షణలో ఉపేక్షించేది లేదు - డిఎస్‌పి కొడకండ్ల ప్రెస్ క్లబ్ కు నూతన కార్యవర్గం ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఎస్సై శ్రీశైలం పై చర్యలు తీసుకోవాలి కోళ్లఫారం ప్రారంభంలో టిడిపి నాయకులు రజక సంఘం నూతన కమిటీ ఎన్నిక ఆత్మకూరులో తెలుగుదేశం యూనిట్ సమావేశం సి జి ఎఫ్ నిధులతో ఆలయాల అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి-- మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్ఎస్‌యూఐ నాయకులపై దాడి పిరికిపంద చర్య మరిపెడలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

పెచ్చులుడుతున్న పాత పాఠశాల భవనం భయాందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు

Select Suryaa Now
పెచ్చులుడుతున్న పాత పాఠశాల భవనం భయాందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు

లింగాల మేజర్ న్యూస్:- లింగాల మండలంలోని ఎగువపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల పాత భవనంలో కొనసాగుతుండటంతో విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
పాఠశాల భవనం పైకప్పు పరిస్థితి పూర్తిగా దెబ్బతినడంతో స్లాబ్ కడ్డీలు బయటకు కనిపిస్తున్నాయి. అలాగే వర్షం వచ్చినా కూడా స్కూల్ మొత్తం అంతా కారుతుందని విద్యార్థులు చెబుతున్నారు.
అంతేకాకుండా స్లాబ్ నుంచి పెచ్చులు, చిన్న చిన్న ముక్కలు ఊడిపడి కింద పడుతున్నాయని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. విద్యార్థులు కింద కూర్చుని చదువుకుంటున్న సమయంలోనే పెచ్చులు ఊడిపడుతుండటంతో ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని భయపడుతున్నారు.
ప్రస్తుతం అదే పాత భవనంలోని ఒక మూలన విద్యార్థులను కూర్చోబెట్టి పాఠాలు బోధించాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని పాఠశాల భవనాన్ని పరిశీలించి, అవసరమైతే వెంటనే మరమ్మతులు చేపట్టాలని లేదా నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
విద్యార్థుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల
ఎగువపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు ఓ. శకుంతలమ్మ 12-06-2025న విధుల్లో చేరిన సమయంలో కేవలం ముగ్గురు విద్యార్థులు మాత్రమే ఉన్నారని స్థానికులు తెలిపారు. విద్యార్థులకు శ్రద్ధగా బోధిస్తూ, తల్లిదండ్రుల్లో నమ్మకం కల్పించడంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరిగింది.
ప్రస్తుతం 2026లో విద్యార్థుల సంఖ్య 22కు చేరుకోవడం పాఠశాలపై గ్రామస్తుల్లో పెరిగిన విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తోంది. విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలకు అనుకూలమైన, సురక్షితమైన భవనం అవసరం మరింత పెరిగింది.
విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నప్పటికీ, వారు చదువుకుంటున్న భవనం మాత్రం ప్రమాదకర పరిస్థితిలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు పనిచేస్తుండగా, మరోవైపు భవనం పరిస్థితి వారిని ఆందోళనకు గురిచేస్తోంది.
అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
పాఠశాల భవనం ప్రస్తుత పరిస్థితిని అధికారులు పరిశీలించి, విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు కోరుతున్నారు. విద్యార్థుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ పాత భవనానికి మరమ్మతులు చేయించడంతో పాటు, అవసరమైతే కొత్త పాఠశాల భవనం నిర్మించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నందుకు సంతోషంగా ఉన్నా.. వారు కూర్చుని చదువుకునే భవనం పరిస్థితి చూస్తే భయంగా ఉంది. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలి  అని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


సాయినాథ్ రెడ్డి లింగాల రిపోర్టర్ కడప జిల్లా