శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో ఘనంగా వరుణ యాగం
నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్ : సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, పాడిపంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు నెల్లూరు నగరం దుర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మంగళవారం వరుణ యాగం జరిగింది. లోక కళ్యాణార్థం చేపట్టిన ఈ విశేష యాగ కార్యక్రమాన్ని ఉదయం ఆలయ ప్రధానార్చకులు, వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా ప్రారంభించి నిర్వహించారు. ఈ పుణ్య కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ఏలూరు శిరీష, ధర్మకర్తల మండలి సభ్యులు, పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లా దేవాదాయ శాఖ అధికారి కోవూరు జనార్దన్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీధర్ నాయుడు, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.