BREAKING
భారత వైమానిక దళ (IAF) నూతన చీఫ్‌‌గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్: అక్టోబర్ 31న బాధ్యతల స్వీకరణ! జొన్న గట్కా తింటే ఆరోగ్యానికి ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి? విద్యార్థిని చితకా బాదిన ఉపాధ్యాయుడు వెలుగు ప్రత్యేక పాఠశాలలో వరల్డ్ సెరిబ్రల్ పాల్సీ డే రాజధాని పనులపై నిర్మాణ సంస్థలతో సీఎం చంద్రబాబు సమీక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి సర్వే నంబర్ 483 భూములపై రీ -సర్వే... ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారితో బాపట్ల ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారి ప్రత్యేక భేటీ ఎస్‌ఐఆర్‌తో అర్హుల ఓట్లను తొలగించొద్దు.. పారదర్శకంగా జాబితా సవరణ చేయాలి:డిసిసి అధ్యక్షుడు ధారాసింగ్‌ నాయక్‌ ఆచార్య డిగ్రీ కళాశాలలో షీ టీమ్స్ అవగాహన సదస్సు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత జార్జ్ పియస్ కన్నుమూత! అంబులెన్స్‌లోనే ప్రసవం.. మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ తల్లి బిడ్డ క్షేమం అంగన్వాడీ సేవలు బహుళ ప్రయోజనకరం శంకరపల్లి మున్సిపాలిటీలో... అభివృద్ధి పనులకు శ్రీకారం రోడ్డు కోసం ఎమ్మెల్యే పద్మావతికి వినతి పత్రం

గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం

Select Suryaa Now
గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం

గరుగుబిల్లి, అక్టోబర్ 6, మేజర్ న్యూస్ : గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను మరింత చేరు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు వ్యయం చేసి ఆరోగ్య కేంద్రాల భవనాలను నిర్మాణం చేపట్టడం జరుగుతుందని కురుపాం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి అన్నారు. గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర గ్రామంలో మంగళవారం నూతనంగా నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, విలేజ్ హెల్త్ క్లినిక్ (గ్రామ ఆరోగ్య కేంద్రం) భవనాన్ని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు.గ్రామస్థులు చిన్నచిన్న అనారోగ్య సమస్యలకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, అందుబాటులోనే ప్రాథమిక వైద్య సేవలు పొందేలా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ఉపయోగపడతాయని తెలిపారు.ప్రజలు ఆరోగ్య కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య మౌలిక వసతుల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ మరడాన నారాయణస్వామి నాయుడు, రాష్ట్ర కొప్పల వెలమ సంక్షేమము మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ అక్కేన మధుసూదనరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరడాన తవిటినాయుడు, అరకు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి సత్యనారాయణ(సత్తిబాబు), కోట భరత్ కుమార్ (సుమన్), మరడాన వెంకటనాయుడు, గరుగుబిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఎన్ ఎం కె తిరుమలప్రసాద్, మండల ఇంజనీరింగ్ అధికారి గోపి గౌరీశంకర్రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.