BREAKING
వెంకటేశ్వర స్వామి ఆలయంలో వర్ణ యాగం ఫోర్జరీ పత్రాలతో మా భూమిని విక్రయించారు అమెరికాలో రాబోయే శీతాకాలంలో ఇంధన ఖర్చులపై అనిశ్చితి వైఎస్ఆర్‌సీపీ పార్టీ కోసం కష్టపడ్డ వారికి ప్రాధాన్యత-ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రైవేట్ మార్కెట్ నుంచి బొగ్గు కొనుగోళ్లకు భారత్ అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ ప్రణాళిక అద్దంకి భవాని సెంటర్లో ముమ్మరంగా వాహన తనిఖీలు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యం పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి.. 8 మంది అరెస్ట్ యువతి అదృశ్యం.. చేవెళ్ల పోలీసుల దర్యాప్తు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గంటా తెల్ల జుట్టుతో విసిగిపోయారా? కరివేపాకుతో ఇంట్లోనే ఈ నేచురల్ హెయిర్ డై తయారు చేసుకోండిలా! కళ్యాణ్ కుమార్ మృతి బిజెపికి తీరని లోటు ..... బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయ రెడ్డి క్యాన్సర్ పేషెంట్ కు ₹5,000/- ఆర్థిక సహాయం ఉపాధ్యాయురాలికి జిల్లాస్థాయి గౌరవం స్టాక్ ఇండెక్స్ పెర్పెచ్యువల్ ఫ్యూచర్స్‌ను ప్రారంభించిన కాల్షి

ఎస్‌ఐఆర్‌తో అర్హుల ఓట్లను తొలగించొద్దు.. పారదర్శకంగా జాబితా సవరణ చేయాలి:డిసిసి అధ్యక్షుడు ధారాసింగ్‌ నాయక్‌

Select Suryaa Now
ఎస్‌ఐఆర్‌తో అర్హుల ఓట్లను తొలగించొద్దు.. పారదర్శకంగా జాబితా సవరణ చేయాలి:డిసిసి అధ్యక్షుడు ధారాసింగ్‌ నాయక్‌

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్(అక్టోబర్‌ 6):
ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా, ఓటర్ల జాబితా సవరణను పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి పార్టీల నాయకులు వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో మంగళవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు జాదవ్‌ ధారాసింగ్‌ నాయక్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీకి కాంగ్రెస్‌తో పాటు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ఎన్‌టీఆర్‌ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ బీజేఆర్‌ చౌరస్తా మీదుగా అంబేద్కర్‌ విగ్రహం వరకు కొనసాగింది. మార్గమధ్యంలో నాయకులు, కార్యకర్తలు ‘ఓటు బచావో–దేశ్‌ బచావో’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడారు.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని డిసిసి అధ్యక్షుడు ధారాసింగ్‌ నాయక్‌ అన్నారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పేరుతో అర్హులైన ఒక్క ఓటు కూడా తొలగించడానికి వీల్లేదన్నారు. ఓటర్ల జాబితాలో మార్పులు, తొలగింపులకు సంబంధించి ప్రజలకు ముందస్తు సమాచారం అందించాలని, అభ్యంతరాలు తెలిపేందుకు, అవసరమైన ఆధారాలు సమర్పించేందుకు తగిన అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు.కొత్తగా అర్హత పొందిన యువత ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు, ఇప్పటికే ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో పరిశీలించుకోవాలని సూచించారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం కొనసాగిస్తామని ధారాసింగ్‌ నాయక్‌ స్పష్టం చేశారు.ర్యాలీలో పరిగి ఎమ్మెల్యే, ఎస్‌ఐఆర్‌ శిక్షణ కమిటీ చైర్మన్‌ టి. రామ్మోహన్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి, సీపీఐ నాయకుడు పీర్‌ మహమ్మద్‌, సీపీఐ(ఎం) నాయకుడు మహిపాల్‌, సీపీఐ(ఎంఎల్‌) నాయకుడు మహేందర్‌, టీజేఎస్‌ నాయకుడు సోమశేఖర్‌, కొడంగల్‌ ఎస్‌ఐఆర్‌ అసెంబ్లీ కోఆర్డినేటర్‌ మాణిక్యం మల్లేష్‌ యాదవ్‌తో పాటు వివిధ పార్టీల జిల్లా నాయకులు, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కుమ్మరి రాఘవేందర్, వికారాబాద్ జిల్లా ప్రతినిధి.