BREAKING
బాక్సాఫీస్ వద్ద అజయ్ దేవగన్ దృశ్యం 3 మేనియా.. ఆరో రోజు కూడా తగ్గని జోరుతో రూ. 230 కోట్ల కలెక్షన్లు! 25 ఏళ్ళు గా దేశాభివృద్ధికి అంకితమై ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తుగా ఎమ్మెల్యే నల్లమిల్లి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ. ప్రధాని నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా సేవా ప్రస్థానానికి అభినందనలు..శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. రామ్‌చరణ్ - సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్ అప్డేట్.. దసరాకు పూజా కార్యక్రమాలు, షూటింగ్ ఎప్పుడంటే? వీరుళ్ళమ్మ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం అంగన్వాడీ ఉత్సవాలు ముగింపు -- పలువురికి సత్కారాలు సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా ఆల్వాల్ లో ఘనంగా సేవా జ్యోతి కార్యక్రమం.. వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఎంప్లాయిస్ చేసే ధర్నాకు... ఏపీ ఎన్ జి జీవోస్ మద్దతు* పేకాట వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే సత్తి విమర్శలు. జిల్లా మెడికల్ అధికారిని కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి* అయోడిన్ లోపం వల్ల పిల్లల్లో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి: పెదవేగి వైద్యాధికారి కార్తీక్ ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బైక్ ర్యాలీ మహిళల ఆర్థిక స్వావలంబన కు ఉపాధిశిక్షణకోర్సులతో సాధ్యం ఆపదలో జనసైనికుడికి జనసేన అండ

అంగన్వాడీ సేవలు బహుళ ప్రయోజనకరం

Select Suryaa Now
అంగన్వాడీ సేవలు బహుళ ప్రయోజనకరం

అంగన్వాడి సేవలు బహుళ ప్రయోజనకరం 
ఆత్మకూరు, మేజర్ న్యూస్, సోమా వెంకటసుబ్బయ్య :
అంగన్వాడీ కేంద్రంలో లభించే సేవలు బహుళ ప్రయోజనకరమైనవని ఆత్మకూరు పట్టణంలోని వందూరుగుంట 2 అంగన్వాడీ కేంద్ర కార్యకర్త గుల్జార్ బేగం పేర్కొన్నారు. మంగళవారం వందూరుగుంట2 అంగన్వాడీ కేంద్రంలో ఐసిడిఎస్ సిడిపిఓ పి. సునీలత పర్యవేక్షణలో సూపర్వైజర్ జి.కస్తూరి ఆధ్వర్యంలో అంగన్వాడి ఉత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పరిధిలోని మహిళలు, గర్భిణీలు, బాలింతలను ఆహ్వానించి అంగన్వాడీ కేంద్రంలో లభించే ప్రయోజనాలను గురించి వివరించారు. గర్భిణీలు బాలింతలకు కేంద్రంలో పౌష్టికాహారం లభిస్తుందని, చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు ఆటపాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్య లభిస్తుందని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. పోషణ్ ప్లేట్ తయారుచేసి అందరికీ అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు గర్భిణీలు, బాలింతలు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.