BREAKING
ఫోర్జరీ పత్రాలతో మా భూమిని విక్రయించారు అమెరికాలో రాబోయే శీతాకాలంలో ఇంధన ఖర్చులపై అనిశ్చితి వైఎస్ఆర్‌సీపీ పార్టీ కోసం కష్టపడ్డ వారికి ప్రాధాన్యత-ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రైవేట్ మార్కెట్ నుంచి బొగ్గు కొనుగోళ్లకు భారత్ అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ ప్రణాళిక అద్దంకి భవాని సెంటర్లో ముమ్మరంగా వాహన తనిఖీలు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యం పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి.. 8 మంది అరెస్ట్ యువతి అదృశ్యం.. చేవెళ్ల పోలీసుల దర్యాప్తు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గంటా తెల్ల జుట్టుతో విసిగిపోయారా? కరివేపాకుతో ఇంట్లోనే ఈ నేచురల్ హెయిర్ డై తయారు చేసుకోండిలా! కళ్యాణ్ కుమార్ మృతి బిజెపికి తీరని లోటు ..... బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయ రెడ్డి క్యాన్సర్ పేషెంట్ కు ₹5,000/- ఆర్థిక సహాయం ఉపాధ్యాయురాలికి జిల్లాస్థాయి గౌరవం స్టాక్ ఇండెక్స్ పెర్పెచ్యువల్ ఫ్యూచర్స్‌ను ప్రారంభించిన కాల్షి కరువు అంచనాలు కాదు.. రైతుకు తక్షణ భరోసా కావాలి:చినుకని శివ ప్రసాద్

అంబులెన్స్‌లోనే ప్రసవం.. మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ తల్లి బిడ్డ క్షేమం

Select Suryaa Now
అంబులెన్స్‌లోనే ప్రసవం..  మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ తల్లి బిడ్డ క్షేమం

అంబులెన్స్‌లోనే ప్రసవం..మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ
తల్లి బిడ్డ క్షేమం

జిన్నారం l:పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు 108 అంబులెన్స్‌లోనే సిబ్బంది ప్రసవం చేయగా, ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. జిన్నారం మండలం అండూర్ గ్రామానికి చెందిన శివాని (20) మంగళవారం తెల్లవారుజామున పురిటినొప్పులతో బాధపడటంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. దీంతో గుమ్మడిదల మండలానికి చెందిన 108 సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు అధికమయ్యాయి. దీంతో ఈఎంటీ కుమారి అంబులెన్స్‌లోనే శివానికి ప్రసవం చేయగా, ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డలను జిన్నారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు 108 పైలట్ అక్షయ్ కుమార్ తెలిపారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు.