BREAKING
పులి పాదముద్రల గుర్తింపు బాక్సాఫీస్ వద్ద అజయ్ దేవగన్ దృశ్యం 3 మేనియా.. ఆరో రోజు కూడా తగ్గని జోరుతో రూ. 230 కోట్ల కలెక్షన్లు! 25 ఏళ్ళు గా దేశాభివృద్ధికి అంకితమై ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తుగా ఎమ్మెల్యే నల్లమిల్లి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ. ప్రధాని నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా సేవా ప్రస్థానానికి అభినందనలు..శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. రామ్‌చరణ్ - సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్ అప్డేట్.. దసరాకు పూజా కార్యక్రమాలు, షూటింగ్ ఎప్పుడంటే? వీరుళ్ళమ్మ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం అంగన్వాడీ ఉత్సవాలు ముగింపు -- పలువురికి సత్కారాలు సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా ఆల్వాల్ లో ఘనంగా సేవా జ్యోతి కార్యక్రమం.. వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఎంప్లాయిస్ చేసే ధర్నాకు... ఏపీ ఎన్ జి జీవోస్ మద్దతు* పేకాట వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే సత్తి విమర్శలు. జిల్లా మెడికల్ అధికారిని కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి* అయోడిన్ లోపం వల్ల పిల్లల్లో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి: పెదవేగి వైద్యాధికారి కార్తీక్ ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బైక్ ర్యాలీ మహిళల ఆర్థిక స్వావలంబన కు ఉపాధిశిక్షణకోర్సులతో సాధ్యం

సర్వే నంబర్ 483 భూములపై రీ -సర్వే...

Select Suryaa Now
సర్వే నంబర్ 483 భూములపై రీ -సర్వే...

-అవకతవకల ఆరోపణలపై రెవెన్యూ అధికారుల విచారణ

మండల పరిధిలోని తిమ్మారెడ్డిగూడ గ్రామంలో భూముల రీ-సర్వే నిర్వహించారు. గ్రామంలోని సర్వే నంబర్ 483లో ఉన్న భూములకు సంబంధించి రెవెన్యూ శాఖలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు రావడంతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో షాబాద్ మండల తహసీల్దార్ ఎండీ అన్వర్ ఆదేశాల మేరకు భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి రీ-సర్వే నిర్వహించారు.గ్రామ సర్పంచ్ గుత్తి చెన్నయ్య, మాజీ ఎంపీటీసీ మద్దూరి పాండు ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు సర్వే నంబర్ 483లోని భూముల హద్దులు, విస్తీర్ణం, అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలించారు. రీ-సర్వే ద్వారా భూముల వాస్తవ పరిస్థితి, రికార్డుల్లో ఉన్న వివరాల మధ్య ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా అనే అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అధికారులు నిర్వహించిన సర్వే నివేదిక ఆధారంగా రికార్డుల పరంగా భూములను కోల్పోయిన బాధితులకు న్యాయం జరగనుందని గ్రామస్తులు తెలిపారు.

షాబాద్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 06)