BREAKING
పీఏసీఎస్‌ల సమస్యల పరిష్కారానికి చర్యలు పులి పాదముద్రల గుర్తింపు బాక్సాఫీస్ వద్ద అజయ్ దేవగన్ దృశ్యం 3 మేనియా.. ఆరో రోజు కూడా తగ్గని జోరుతో రూ. 230 కోట్ల కలెక్షన్లు! 25 ఏళ్ళు గా దేశాభివృద్ధికి అంకితమై ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తుగా ఎమ్మెల్యే నల్లమిల్లి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ. ప్రధాని నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా సేవా ప్రస్థానానికి అభినందనలు..శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. రామ్‌చరణ్ - సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్ అప్డేట్.. దసరాకు పూజా కార్యక్రమాలు, షూటింగ్ ఎప్పుడంటే? వీరుళ్ళమ్మ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం అంగన్వాడీ ఉత్సవాలు ముగింపు -- పలువురికి సత్కారాలు సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా ఆల్వాల్ లో ఘనంగా సేవా జ్యోతి కార్యక్రమం.. వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఎంప్లాయిస్ చేసే ధర్నాకు... ఏపీ ఎన్ జి జీవోస్ మద్దతు* పేకాట వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే సత్తి విమర్శలు. జిల్లా మెడికల్ అధికారిని కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి* అయోడిన్ లోపం వల్ల పిల్లల్లో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి: పెదవేగి వైద్యాధికారి కార్తీక్ ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బైక్ ర్యాలీ

ఆచార్య డిగ్రీ కళాశాలలో షీ టీమ్స్ అవగాహన సదస్సు

Select Suryaa Now
ఆచార్య డిగ్రీ కళాశాలలో షీ టీమ్స్ అవగాహన సదస్సు

ఆచార్య డిగ్రీ కళాశాలలో షీ టీమ్స్ అవగాహన సదస్సు

మహిళలు, విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్‌ఐ పుష్పలత రెడ్డి

జహీరాబాద్: జిల్లా ఎస్పీ పారితోష్  ఆదేశాల మేరకు మహిళల భద్రత, రక్షణ, చట్టాలపై అవగాహన కల్పించేందుకు షీ టీమ్స్ ఆధ్వర్యంలో జహీరాబాద్‌లోని ఆచార్య డిగ్రీ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జహీరాబాద్ పట్టణ సబ్‌ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్-2 పుష్పలత రెడ్డి హాజరై విద్యార్థినులకు మహిళల భద్రత, సైబర్ నేరాలు, వేధింపుల నివారణపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్‌ఐ పుష్పలత రెడ్డి మాట్లాడుతూ, మహిళలు, విద్యార్థినులు తమ భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి వేధింపులు ఎదురైనా భయపడకుండా పోలీసుల సహాయం తీసుకోవాలని సూచించారు. మహిళల భద్రతకు పోలీస్ శాఖ ప్రాధాన్యత ఇస్తోందని, మహిళలను వేధించడం, వెంటపడటం, అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి చర్యలకు పాల్పడేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.ప్రస్తుత కాలంలో సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాను జాగ్రత్తగా వినియోగించాలని, అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, బ్యాంకు సమాచారం, ఓటీపీలు పంచుకోవద్దని సూచించారు. సోషల్ మీడియా ద్వారా ఎవరైనా వేధింపులకు పాల్పడినా, బెదిరింపులకు గురిచేసినా సంబంధిత ఆధారాలను భద్రపరచి పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.విద్యార్థినులు తమకు ఎదురయ్యే సమస్యలను కుటుంబ సభ్యులు, కళాశాల యాజమాన్యం లేదా పోలీసుల దృష్టికి తీసుకురావాలని, మౌనంగా భరించకుండా సరైన సమయంలో స్పందించాలని ఎస్‌ఐ సూచించారు. మహిళలపై జరిగే నేరాల నివారణకు ప్రజల్లో అవగాహన పెరగడం అవసరమని, షీ టీమ్స్ ద్వారా మహిళలకు భద్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ నసీరుద్దీన్, మహిళా పోలీస్ కానిస్టేబుల్ గౌతమి, కళాశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినులు మహిళల భద్రతకు సంబంధించిన అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని నిర్వాహకులు సూచించారు.