BREAKING
ఫోర్జరీ పత్రాలతో మా భూమిని విక్రయించారు అమెరికాలో రాబోయే శీతాకాలంలో ఇంధన ఖర్చులపై అనిశ్చితి వైఎస్ఆర్‌సీపీ పార్టీ కోసం కష్టపడ్డ వారికి ప్రాధాన్యత-ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రైవేట్ మార్కెట్ నుంచి బొగ్గు కొనుగోళ్లకు భారత్ అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ ప్రణాళిక అద్దంకి భవాని సెంటర్లో ముమ్మరంగా వాహన తనిఖీలు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యం పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి.. 8 మంది అరెస్ట్ యువతి అదృశ్యం.. చేవెళ్ల పోలీసుల దర్యాప్తు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గంటా తెల్ల జుట్టుతో విసిగిపోయారా? కరివేపాకుతో ఇంట్లోనే ఈ నేచురల్ హెయిర్ డై తయారు చేసుకోండిలా! కళ్యాణ్ కుమార్ మృతి బిజెపికి తీరని లోటు ..... బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయ రెడ్డి క్యాన్సర్ పేషెంట్ కు ₹5,000/- ఆర్థిక సహాయం ఉపాధ్యాయురాలికి జిల్లాస్థాయి గౌరవం స్టాక్ ఇండెక్స్ పెర్పెచ్యువల్ ఫ్యూచర్స్‌ను ప్రారంభించిన కాల్షి కరువు అంచనాలు కాదు.. రైతుకు తక్షణ భరోసా కావాలి:చినుకని శివ ప్రసాద్

స్మశానం దారి ఆక్రమిస్తున్నా, పట్టించుకోని అధికారులు

Select Suryaa Now
స్మశానం దారి ఆక్రమిస్తున్నా, పట్టించుకోని అధికారులు

స్మశానం దారి అడ్డుకుంటున్నా,ప్రభుత్వ భూమి ఆక్రమిస్తున్నా పట్టించుకోని అధికారులు 
ఆత్మకూరు, మేజర్ న్యూస్, సోమా వెంకటసుబ్బయ్య : ఆత్మకూరు నియోజకవర్గం లోని చేజర్ల మండలం ఆదూరుపల్లి లో గిరిజనుల స్మశానానికి దారిని కొందరు అడ్డుకుంటున్నా, ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమిస్తున్నా సంబంధిత అధికారులకు విన్నవించినా సరైన చర్యలు తీసుకోవడం లేదంటూ పలువురు గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదురుపల్లి కి చెందిన చెవూరు చెంచయ్య ఈ విషయమై తాసిల్దార్ కు సర్వే నంబర్ 522-1 లో ఉన్న స్మశాన వాటికకు వెళ్లేందుకు ఏటూరు గ్రామ సర్వే నంబరు 626-4 లో దారి విషయమై అదే గ్రామానికి చెందిన పీర్ల శంకరయ్య,పెంచలయ్య, సీనయ్య లతో వివాదం ఉందని, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నదని, అసలైన హక్కుదారులు అనుభవదారులు ఎవరు అనే విషయం తెలపాలని తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. రెవిన్యూ అధికారి చేత విచారణ జరిపించామని, క్షేత్రస్థాయిలో,రికార్డుల పరిశీలన అనంతరం నివేదిక అందజేశారని సర్వేనెంబర్ 522లో ఒకటిలో 57.53 ఎకరాలు 522లో 19 సెంట్లు భూమి 35 సెంట్లు ఎల్పీఎం నెంబర్ 2093 ప్రకారం 35సెంట్లు భూమిని స్మశాన వాటికగా నమోదు చేసి ఉన్నారని, ఆ భూమికి వెళ్లేందుకు ఏటూరు గ్రామ సర్వే నంబరు 626లో నాలుగులో రెండు ఎకరాలు నుండి దారి ఉన్నదని, ఆ రెండు ఎకరాలు చుక్కల భూమిగా నమోదయి ఉందన్నారు. వెబ్ల్యాండ్ అడంగల్ లో పట్టాదారుగా గొలగమూడి పెంచలయ్య పేరు నమోదయి ఉందని, ఈ దారి విషయమై శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా తగు చర్యలు తీసుకోవాలంటూ తాసిల్దారు గత నెల 23వతేదీ చేజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా 522లో 80 సెంట్ల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకొని జెసిబి తో స్థలాన్ని చదును చేసి మొక్కలు నాటే ప్రయత్నం చేశారు. ఈ విషయం స్థానికులు అడ్డుకొని తాసిల్దారుకు తెలుపుగా ఆయన ప్రభుత్వ భూమి ఎవరు ప్రవేశించరాదని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ ఆ హెచ్చరిక బోర్డులను  కూడా కొందరు తొలగించారు. తాసిల్దారు ఫిర్యాదు చేసినా  తగిన చర్యలు లేవంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే పరిశీలించి సత్వరమే తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.