BREAKING
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారితో బాపట్ల ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారి ప్రత్యేక భేటీ ఎస్‌ఐఆర్‌తో అర్హుల ఓట్లను తొలగించొద్దు.. పారదర్శకంగా జాబితా సవరణ చేయాలి:డిసిసి అధ్యక్షుడు ధారాసింగ్‌ నాయక్‌ ఆచార్య డిగ్రీ కళాశాలలో షీ టీమ్స్ అవగాహన సదస్సు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత జార్జ్ పియస్ కన్నుమూత! అంబులెన్స్‌లోనే ప్రసవం.. మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ తల్లి బిడ్డ క్షేమం అంగన్వాడీ సేవలు బహుళ ప్రయోజనకరం శంకరపల్లి మున్సిపాలిటీలో... అభివృద్ధి పనులకు శ్రీకారం రోడ్డు కోసం ఎమ్మెల్యే పద్మావతికి వినతి పత్రం ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన ట్రాక్టర్ విద్యారంగంలో అన్నమయ్యను ముందంజలో నిలపాలి స్మశానం దారి ఆక్రమిస్తున్నా, ప్రభుత్వ భూమి ఆక్రమిస్తున్నా పట్టించుకోని అధికారులు స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధులు కావాలి -- అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఇద్దరికి రూ.10 వేల చొప్పున జరిమానా.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిబంధనలు పాటించాలి. షట్టర్‌లో పేకాట.. ఆరుగురు అరెస్ట్

ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలి

Select Suryaa Now
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలి


– పెన్ పహాడ్ పి.హెచ్.సి.లో సమీక్షా సమావేశం
– ఆశా కార్యకర్తలకు జిల్లా అధికారుల దిశానిర్దేశం

పెన్ పహాడ్, మేజర్ న్యూస్

గర్భిణుల వివరాల నమోదు 100 శాతం పూర్తి కావాలని, కాన్పులన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరిగేలా ఆశా కార్యకర్తలు అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  'ఆశా డే' సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి స్టాటిస్టికల్ ఆఫీసర్ బాసిత్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ మత్స్యగిరి, పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ శిరోమణి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తలు పూర్తి బాధ్యతతో ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలన్నారు. ఆన్‌లైన్ నివేదికలను, రికార్డులను ఎప్పటికప్పుడు త్వరితగతిన నవీకరించాలని ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ అజెండా ప్రకారం.. స్వచ్ఛ భారత్ స్పెషల్ డ్రైవ్, ఇంటింటి జ్వరాల సర్వే, గర్భిణులు మరియు పిల్లల ఆరోగ్య సంరక్షణ, వ్యాధి నిరోధక టీకాలు, హెచ్‌పీవీ  వ్యాక్సినేషన్ డ్రైవ్, టీబీ, డెంగ్యూ, మలేరియా, ఎన్సీడీ స్క్రీనింగ్ తదితర ఆరోగ్య కార్యక్రమాల అమలుపై సుదీర్ఘంగా సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో పి.హెచ్.సి వైద్యాధికారి డాక్టర్ రాజేష్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సైదమ్మ, పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ పద్మ, ఆరోగ్య విస్తరణ అధికారి ప్రభాకర్, ఎం.ఎల్.హెచ్.పి హెల్త్ అసిస్టెంట్లు,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.