BREAKING
పీఏసీఎస్‌ల సమస్యల పరిష్కారానికి చర్యలు పులి పాదముద్రల గుర్తింపు బాక్సాఫీస్ వద్ద అజయ్ దేవగన్ దృశ్యం 3 మేనియా.. ఆరో రోజు కూడా తగ్గని జోరుతో రూ. 230 కోట్ల కలెక్షన్లు! 25 ఏళ్ళు గా దేశాభివృద్ధికి అంకితమై ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తుగా ఎమ్మెల్యే నల్లమిల్లి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ. ప్రధాని నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా సేవా ప్రస్థానానికి అభినందనలు..శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. రామ్‌చరణ్ - సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్ అప్డేట్.. దసరాకు పూజా కార్యక్రమాలు, షూటింగ్ ఎప్పుడంటే? వీరుళ్ళమ్మ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం అంగన్వాడీ ఉత్సవాలు ముగింపు -- పలువురికి సత్కారాలు సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా ఆల్వాల్ లో ఘనంగా సేవా జ్యోతి కార్యక్రమం.. వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఎంప్లాయిస్ చేసే ధర్నాకు... ఏపీ ఎన్ జి జీవోస్ మద్దతు* పేకాట వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే సత్తి విమర్శలు. జిల్లా మెడికల్ అధికారిని కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి* అయోడిన్ లోపం వల్ల పిల్లల్లో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి: పెదవేగి వైద్యాధికారి కార్తీక్ ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బైక్ ర్యాలీ

ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిబంధనలు పాటించాలి.

Select Suryaa Now
ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిబంధనలు పాటించాలి.

బాలింత మృతి ఘటనపై సమగ్ర నివేదిక తీసుకుంటాం.

• డీఎంహెచ్‌ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్

సూర్య మంచిర్యాల టౌన్ : 

జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆదేశించారు. మంగళవారం ఆయన మంచిర్యాలలోని ప్రతిభ నర్సింగ్ హోమ్, శ్రీనివాస నర్సింగ్ హోమ్‌లను ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవలు, రికార్డులు, కేసు షీట్లను పరిశీలించారు. ప్రతిభ నర్సింగ్ హోమ్‌లో బాలింత శ్రీమతి రుచితకు అందించిన వైద్య సేవల వివరాలను డీఎంహెచ్‌ఓ అడిగి తెలుసుకున్నారు. అలాగే శ్రీనివాస నర్సింగ్ హోమ్‌లో ఘట్టమ్మకు అందించిన వైద్య సేవలను పరిశీలించారు. బాలింత మృతికి దారితీసిన కారణాలపై సమగ్ర వివరాలు, నివేదికను సేకరిస్తున్నామని తెలిపారు. ఆసుపత్రుల్లోని కేసు షీట్లు, వైద్య రికార్డులు, అందించిన చికిత్స తదితర అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ జిల్లాలో క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ కింద నమోదైన ప్రతి ప్రైవేట్ ఆసుపత్రి నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, వైద్యాధికారులు, స్పెషలిస్ట్ వైద్యుల వివరాలను రోగులకు కనిపించే విధంగా ప్రదర్శించాలన్నారు. వివిధ చికిత్సలకు సంబంధించిన చార్జీలను ఆసుపత్రిలోని రెండు, మూడు ముఖ్యమైన ప్రదేశాల్లో స్పష్టంగా డిస్‌ప్లే చేయాలని ఆదేశించారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు, స్పెషలిస్టులు, సిబ్బంది వివరాలను కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతి ఫార్మసీలో ఫార్మసిస్ట్ ద్వారా మాత్రమే మందులు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ల్యాబొరేటరీల్లో నిర్వహించే పరీక్షలు, వాటికి సంబంధించిన వివరాలు, ధరలను స్పష్టంగా ప్రదర్శించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచడంతో పాటు వాటి వినియోగంపై ఆసుపత్రి సిబ్బందిలో కనీసం ఒకరికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన కాలుష్య నియంత్రణ మండలి ధ్రువపత్రాలను ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రోగులతో సిబ్బంది సమన్వయంతో వ్యవహరించాలని, అవసరమైన సందర్భాల్లో కౌన్సెలింగ్ ద్వారా వైద్య సేవలు, చికిత్సకు సంబంధించిన వివరాలను స్పష్టంగా తెలియజేయాలని డీఎంహెచ్‌ఓ సూచించారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలకు అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అరుణశ్రీ, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, వైద్యులు వెంకట సాయి, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ ప్రతిభ, డాక్టర్ రఘువంశీ తదితరులు పాల్గొన్నారు.