BREAKING
నో అబ్జక్షన్ సర్టిఫికెట్ల జారీకి సింగిల్ విండో ఏర్పాటు చేయాలి మూసీ అభివృద్ధిపై రైతులతో ముఖాముఖి:తహసీల్దారు చంద్రశేఖర్‌ భారత వైమానిక దళ (IAF) నూతన చీఫ్‌‌గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్: అక్టోబర్ 31న బాధ్యతల స్వీకరణ! జొన్న గట్కా తింటే ఆరోగ్యానికి ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి? విద్యార్థిని చితకా బాదిన ఉపాధ్యాయుడు వెలుగు ప్రత్యేక పాఠశాలలో వరల్డ్ సెరిబ్రల్ పాల్సీ డే రాజధాని పనులపై నిర్మాణ సంస్థలతో సీఎం చంద్రబాబు సమీక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి సర్వే నంబర్ 483 భూములపై రీ -సర్వే... ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారితో బాపట్ల ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారి ప్రత్యేక భేటీ ఎస్‌ఐఆర్‌తో అర్హుల ఓట్లను తొలగించొద్దు.. పారదర్శకంగా జాబితా సవరణ చేయాలి:డిసిసి అధ్యక్షుడు ధారాసింగ్‌ నాయక్‌ ఆచార్య డిగ్రీ కళాశాలలో షీ టీమ్స్ అవగాహన సదస్సు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత జార్జ్ పియస్ కన్నుమూత! అంబులెన్స్‌లోనే ప్రసవం.. మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ తల్లి బిడ్డ క్షేమం అంగన్వాడీ సేవలు బహుళ ప్రయోజనకరం

​రూ. 75 లక్షలతో నిర్మించిన సబ్ ట్రెజరీ నూతన భవనం ప్రారంభించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు

Select Suryaa Now
 ​రూ. 75 లక్షలతో నిర్మించిన  సబ్ ట్రెజరీ నూతన భవనం ప్రారంభించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు

 

​నర్సీపట్నం ప్రభుత్వ నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడానికి ఖజానా (ట్రెజరీ) వ్యవస్థ ఎంతో కీలకమని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. నర్సీపట్నంలో సుమారు రూ. 75 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన డివిజనల్ ఉప ఖజానా కార్యాలయ భవనాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. 
​ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల నిధులు ఖజానా శాఖ ద్వారానే విడుదల కావడం వల్ల పక్కాగా అకౌంటబిలిటీ ఉంటుందని, నిధుల దుర్వినియోగానికి తావుండదని స్పష్టం చేశారు. గతంలో విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు వెళ్లిపోవడం వల్ల ఖర్చుల వివరాలపై సరైన జవాబుదారీతనం ఉండేది కాదని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం స్పర్శ్ గ్రాంట్లతో సహా దేశంలోని ఏ యూనివర్సిటీకి నిధులు ఇచ్చినప్పటికీ, ట్రెజరీ ద్వారానే మంజూరు చేసేలా కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. అంతేకాకుండా, ఉపాధి హామీ పథకం నిధులను కూడా ఇకపై ట్రెజరీల ద్వారానే చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.  
​ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల ఖజానా శాఖ సేవలు మరింత వేగవంతం, పారదర్శకం అయ్యాయని చెప్పారు. నర్సీపట్నంలో బ్రిటిష్ కాలం నాటి పాత ఎమ్మార్వో ఆఫీసు స్థానంలో ఆధునిక భవనాన్ని నిర్మించుకోవడం ఆనందదాయకమని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా కోటవురట్ల, నక్కపల్లి తదితర ప్రాంతాల్లో కూడా సబ్ ట్రెజరీ భవనాల నిర్మాణ ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు.  
​ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ సూర్యచంద్ర, టిడిపి పట్టణ అధ్యక్షులు చింతకాయల రాజేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, టిడిపి నాయకులు ధనిమిరెడ్డి మధు. తహసీల్దార్ రామారావు, రెవెన్యూ మరియు ట్రెజరీ అధికారులు, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.