BREAKING
ఫోర్జరీ పత్రాలతో మా భూమిని విక్రయించారు అమెరికాలో రాబోయే శీతాకాలంలో ఇంధన ఖర్చులపై అనిశ్చితి వైఎస్ఆర్‌సీపీ పార్టీ కోసం కష్టపడ్డ వారికి ప్రాధాన్యత-ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రైవేట్ మార్కెట్ నుంచి బొగ్గు కొనుగోళ్లకు భారత్ అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ ప్రణాళిక అద్దంకి భవాని సెంటర్లో ముమ్మరంగా వాహన తనిఖీలు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యం పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి.. 8 మంది అరెస్ట్ యువతి అదృశ్యం.. చేవెళ్ల పోలీసుల దర్యాప్తు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గంటా తెల్ల జుట్టుతో విసిగిపోయారా? కరివేపాకుతో ఇంట్లోనే ఈ నేచురల్ హెయిర్ డై తయారు చేసుకోండిలా! కళ్యాణ్ కుమార్ మృతి బిజెపికి తీరని లోటు ..... బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయ రెడ్డి క్యాన్సర్ పేషెంట్ కు ₹5,000/- ఆర్థిక సహాయం ఉపాధ్యాయురాలికి జిల్లాస్థాయి గౌరవం స్టాక్ ఇండెక్స్ పెర్పెచ్యువల్ ఫ్యూచర్స్‌ను ప్రారంభించిన కాల్షి కరువు అంచనాలు కాదు.. రైతుకు తక్షణ భరోసా కావాలి:చినుకని శివ ప్రసాద్

మూసీ అభివృద్ధిపై రైతులతో ముఖాముఖి:తహసీల్దారు చంద్రశేఖర్‌

Select Suryaa Now
మూసీ అభివృద్ధిపై రైతులతో ముఖాముఖి:తహసీల్దారు చంద్రశేఖర్‌

ఘట్‌కేసర్ రూరల్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 06) : మూసీ రివర్‌ఫ్రంట్‌ అభివృద్ధి, ల్యాండ్‌ పూలింగ్‌ అంశాలపై రైతులు, పట్టాదారులు, గ్రామస్తులతో నేరుగా చర్చించి వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నట్లు తహసీల్దారు బి.చంద్రశేఖర్‌ తెలిపారు. ఇందుకోసం బుధవారం ఘట్‌కేసర్‌ రెవెన్యూ మండల పరిధిలోని పలు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ల్యాండ్‌ పూలింగ్‌పై ప్రజల సూచనలు, అభిప్రాయాలతో పాటు సమ్మతిని కూడా స్వీకరించనున్నట్లు చెప్పారు. ప్రతాపసింగారం, కాచవానిసింగారం, ముత్తివెల్లిగూడ గ్రామాలకు సంబంధించి ప్రతాపసింగారం రైతు వేదికలో మధ్యాహ్నం 2.30 గంటలకు గ్రామసభ నిర్వహించనున్నారు. కొర్రెముల పాత గ్రామ పంచాయతీ కార్యాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు, ఎదులాబాద్‌ పాత గ్రామ పంచాయతీ కార్యాలయంలో సాయంత్రం 4.30 గంటలకు గ్రామసభలు జరగనున్నాయి. మూసీ ల్యాండ్‌ పూలింగ్‌, రివర్‌ఫ్రంట్‌ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సంబంధిత పట్టాదారులు, రైతులు, గ్రామస్తులతో సమావేశాల్లో చర్చించనున్నట్లు చంద్రశేఖర్‌ తెలిపారు. ఈ సందర్భంగా వారి సూచనలు, అభిప్రాయాలు, సమ్మతిని నమోదు చేస్తామని పేర్కొన్నారు. సంబంధిత గ్రామాల ప్రజలు నిర్ణీత సమయానికి తమకు కేటాయించిన వేదికలకు హాజరై గ్రామసభల్లో పాల్గొనాలని తహసీల్దారు కోరారు.

లంబరాజు ఘట్కేసర్ రూరల్ రిపోర్టర్, మేడ్చల్ జిల్లా.