8న పర్చూరులో మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పర్యటన విజయవంతం చేయాలి
పర్చూరు: ఈనెల 8వ తేదీన పర్చూరులో రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు, పర్చూరు ఎమ్మెల్యే శ్రీ ఏలూరి సాంబశివరావు గారితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారని పర్చూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తెలియజేశారు.ఈ పర్యటనలో భాగంగా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి కోట్లాది రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పర్చూరు అభివృద్ధికి మరింత ఊతం లభించనుందని తెలిపారు.