BREAKING
మూసీ అభివృద్ధిపై రైతులతో ముఖాముఖి:తహసీల్దారు చంద్రశేఖర్‌ భారత వైమానిక దళ (IAF) నూతన చీఫ్‌‌గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్: అక్టోబర్ 31న బాధ్యతల స్వీకరణ! జొన్న గట్కా తింటే ఆరోగ్యానికి ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి? విద్యార్థిని చితకా బాదిన ఉపాధ్యాయుడు వెలుగు ప్రత్యేక పాఠశాలలో వరల్డ్ సెరిబ్రల్ పాల్సీ డే రాజధాని పనులపై నిర్మాణ సంస్థలతో సీఎం చంద్రబాబు సమీక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి సర్వే నంబర్ 483 భూములపై రీ -సర్వే... ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారితో బాపట్ల ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారి ప్రత్యేక భేటీ ఎస్‌ఐఆర్‌తో అర్హుల ఓట్లను తొలగించొద్దు.. పారదర్శకంగా జాబితా సవరణ చేయాలి:డిసిసి అధ్యక్షుడు ధారాసింగ్‌ నాయక్‌ ఆచార్య డిగ్రీ కళాశాలలో షీ టీమ్స్ అవగాహన సదస్సు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత జార్జ్ పియస్ కన్నుమూత! అంబులెన్స్‌లోనే ప్రసవం.. మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ తల్లి బిడ్డ క్షేమం అంగన్వాడీ సేవలు బహుళ ప్రయోజనకరం శంకరపల్లి మున్సిపాలిటీలో... అభివృద్ధి పనులకు శ్రీకారం

కలిసికట్టుగా పనిచేసి వైకాపా విజయానికి కృషి చేయాలి: కంగాటి శ్రీదేవమ్మ

Select Suryaa Now
కలిసికట్టుగా పనిచేసి వైకాపా విజయానికి కృషి చేయాలి: కంగాటి శ్రీదేవమ్మ

పత్తికొండ సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని హోసూరు గ్రామంలో వైకాపా గ్రామ, మండల అనుబంధ విభాగాల నాయకులకు మంగళవారం ఆమె పార్టీ ఐడీ కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీదేవమ్మ మాట్లాడుతూ.. నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులకు చేకూరిన ప్రయోజనాలను ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలని సూచించారు. అదే విధంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 'సూపర్ సిక్స్' హామీలను అమలు చేయడంలో తీవ్రంగా విఫలమైందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.రాబోయే ఎన్నికల నాటికి పార్టీ శ్రేణులన్నీ సమష్టిగా, ఐక్యంగా సిద్ధం కావాలని, క్షేత్రస్థాయిలో విస్తృతంగా పనిచేస్తేనే హోసూరు గ్రామంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు