కలిసి పనిచేద్దాం విజయం సాధిద్దాం యువమోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సింధు పైడికొండల
తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; నాయకులు కార్యకర్తలు కలిసి పని చేసి స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి కూటమి విజయం సుసాధ్యమని బీజేపీ యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సింధు పైడికొండల అన్నారు. బిజెపి తాడేపల్లిగూడెం పట్టణ సమావేశంలో సింధు ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికలలో బిజెపి సహా కూటమి పార్టీల అభ్యర్థుల విజయం కోసం సమిష్టిగా కృషి చేయాలని కోరారు. కోట రాంబాబు మాట్లాడుతూ పార్టీ నాయకులు అంతా సమన్వయంతో సమిష్టిగా పనిచేసి మరింత బలో పేతం చేయాలన్నారు. ముప్పిడి సురేష్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి అభ్యర్థులు గా ఎంపికైన వారు అన్ని అంశాలు పరిశీలించి ఆవగాహనతో నామినేషన్లు వేసేందుకు సిద్ధం కావాలన్నారు. రంగోలి నిర్వహించిన మహిళా మోర్చా అధ్యక్షురాలు గోకా మహాలక్ష్మి ని అభినందించారు. పట్టణ అధ్యక్షులు దువ్వ శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర జిల్లా నాయకత్వాల ఆదేశాల మేరకు స్థానిక మునిసిపల్ ఎన్నికలలో పోటీ చేసేందుకు ఆసక్తి కలిగిన వారి నుంచి వివరాలు సేకరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి చిట్యాల రాంబాబు, డి శ్రీనివాస్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మారిశెట్టి నరసింహమూర్తి, మహిళా మోర్చ జిల్లా ఉపాధ్యక్షురాలు తాడాల సూర్యకుమారి, పట్టణ ప్రధాన కార్యదర్శులు సన్నిధి లక్ష్మీ దుర్గ, తుట్టగుంట కృష్ణకుమారి, కిసాన్ మోర్చా నాయకులు చెరుకూరి గంగాధర్ రావు, ఎస్సి మోర్చా జిల్లా నాయకులు వి ఆర్ వి ఎల్ నారాయణ, ఓబీసీ మోర్చా జిల్లా నాయకులు ఇమ్మంది బెనర్జీ, తదితరులు పాల్గొన్నారు
రిపోర్టర్ :శ్రీనివాస్. తాడేపల్లిగూడెం. పశ్చిమగోదావరి జిల్లా,