BREAKING
వసతులు కరువైన బస్టాండ్ లిటిల్ హార్ట్స్ హీరో మౌళి కొత్త చిత్రం.. దొంగ నా కొడుకు రిలీజ్ డేట్ లాక్! పిచ్చికుక్క సైర విహారం రెండేళ్ళ బాలుడితో సహా ఆరుగురికి గాయాలు క్లీన్ ప్రొద్దుటూరుకు కెమెరాల నిఘా అడుగులు శ్రీ కోటదుర్గ ఆలయం లో గోడ పత్రిక విడుదల కొత్తపల్లి,రావుపల్లి గ్రామాల అంగన్వాడీ వర్కర్లకు సత్కారం మండల విద్యాశాఖ అధికారులకు ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించిన డీఈవో స్థానిక సంస్థల ఎన్నికలకు స్ట్రాంగ్ రూమ్ పరిశీలన తెగిపోయిన చేతికి మళ్లీ ప్రాణం… పీఎంశ్రీ పాఠశాలల్లో.. ప్రత్యేక అతిథి విద్యాబోధకుల నియామకం ఆటో ద్విచక్ర వాహనం ఢీ ఒకరికి గాయాలు.... చిగురుకోట జడ్పీ హైస్కూల్ ను పరిశీలించిన ఎస్ఎంసి చైర్మన్ దండే లక్ష్మి పాలకొండ శ్రీ కోట దుర్గమ్మ ఉత్సవ ఏర్పాట్ల పరిశీలన కనిగిరి చేరిన బ్యాలట్ బాక్స్ లు కోర్టు సినిమా హీరోయిన్ శ్రీదేవి కొత్త చిత్రం హైకూ ట్రైలర్ రిలీజ్.. అక్టోబర్ 23న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్!

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది - ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి వెల్లడి

Select Suryaa Now
మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది -  ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి వెల్లడి

గరుగుబిల్లి, అక్టోబర్ 6, మేజర్ న్యూస్ : మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కురుపాం నియోజకవర్గం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి పేర్కొన్నారు.జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో భద్రగిరి (డుమ్మంగి) మత్స్యక్షేత్రం నుంచి తీసుకువచ్చిన చేప పిల్లలను తోటపల్లి ప్రాజెక్టులో మంగళవారం ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి విడుదల చేశారు. ఈ సంద ర్భంగా జరిగిన సమావేశంలో ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి మాట్లాడుతూ తోటపల్లి ప్రాజెక్టులో మత్స్య సంపదను అభివృద్ధి చేసి, స్థానిక మత్స్యకార కుటుంబాలకు మెరుగైన జీవనోపాధి కల్పించేందుకు చేప పిల్లలను విడుదల చేయడం జరిగిందన్నారు.తోటపల్లి ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ప్రభావి తమైన సుమారు 250 కుటుంబాలకు మత్స్యకార వృత్తి ద్వారా జీవనోపాధి కల్పించేందుకు చర్యలు చేపడుతున్న ట్లు తెలిపారు. రిజర్వాయర్‌ను లైసె న్సింగ్ వ్యవస్థలోకి తీసుకురావడం ద్వారా మత్స్యకారులకు అతి తక్కువ లైసెన్స్ ఫీజుతో చేపలు పట్టుకునే హక్కు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో మత్స్యకారులు తమ సంప్ర దాయ వృత్తిని కొనసాగిస్తూ ఆదాయాన్ని పెంచుకునేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. రిజర్వాయర్‌లో చేపల పెంపకం, మత్స్య సంపద అభివృద్ధి ద్వారా స్థానిక మత్స్యకార కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే జగదీశ్వరి పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఉరిటి రామారావు, రాష్ట్ర కొప్పల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ అక్కేన మధుసూద నరావు, రాష్ట్ర నాటక రంగ అకాడమీ డైరెక్టర్ అంబటి రాంబాబు, మండల తెలుగుదేశం కన్వీనర్ మరడాన నారాయణస్వామినాయుడు, టిడిపి నాయకులు మరడాన తవిటి నాయుడు, మాజీ ఎంపీటీసీలు ద్వారపురెడ్డి సత్యనారాయణ (సత్తిబాబు), కోట సుమన్, నంగిరెడ్డి మధుసూదనరావు, పెద్దింటి పూర్ణచంద్రరావు, మత్స్య సహకార సంఘం ఉపాధ్యక్షులు దాసరి లక్ష్మణరావు, జిల్లా మత్స్య శాఖ అధికారి టి సంతోష్ కుమార్, మత్స్య అభివృద్ధి అధికారి వై శ్రీదేవి, యు. చాందిని, మత్స్య సహాయకులు పొందూరు ప్రదీప్, శ్రీనివాస్, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.