BREAKING
శ్రీదుర్గా మల్లేశ్వరి ఆలయంలో వరుణయాగం లో పాల్గొన్న సభాపతి అయ్యన్నపాత్రుడు పద్మావతి దంపతులు* ​రూ. 75 లక్షలతో నిర్మించిన సబ్ ట్రెజరీ నూతన భవనం ప్రారంభించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు చీప్ ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలి :కేతా గోపాలన్ దృశ్యం సెట్స్‌లో శ్రియా శరణ్‌కు అరుదైన అనుభవం.. అజయ్‌ దేవ్‌గణ్‌ కంటే ముందే ఇంటికి పంపేశారట! పోషకాహార లోపం నివారణలో అంగన్వాడీల పాత్ర కీలకం స్విమ్మింగ్ పోటీల్లో 2 సిల్వర్ మెడల్స్ సాధించిన మండల దివ్యాంగులు బ్యాలెట్ బాక్సులు మరమ్మత్తులు త్వరగా పూర్తి చేయాలి జనవాడ పాఠశాలను తనిఖీ చేసిన డిఈఓ వెంకటేశ్వర్లు మంత్రి కొల్లు రవీంద్రను కలిసిన షణ్ముగం! కలిసి పనిచేద్దాం విజయం సాధిద్దాం యువమోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సింధు పైడికొండల కలిసికట్టుగా పనిచేసి వైకాపా విజయానికి కృషి చేయాలి: కంగాటి శ్రీదేవమ్మ సోషల్ మీడియాకు దూరంగా ఉంటూనే ప్రశాంతమైన జీవితం గడుపుతున్న ప్రముఖ నటి ఐశ్వర్య లక్ష్మి గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలి 8న పర్చూరులో మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పర్యటన విజయవంతం చేయాలి

ప్రపంచ స్థాయిలో ఎస్వీయూ అధ్యాపకుల అరుదైన ఘనత

Select Suryaa Now
ప్రపంచ స్థాయిలో ఎస్వీయూ అధ్యాపకుల అరుదైన ఘనత

 

ప్రపంచస్థాయిలో ఎస్వీయూ భౌతిక శాస్త్ర విభాగానికి చెందిన 8 మంది అధ్యాపకులు, ప్రముఖ పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా టాప్-1000 పరిశోధకుల జాబితాలో స్థానం సాధించి అరుదైన ఘనత సాధించారు. ఇందులో ప్రొఫెసర్ సీకే జయశంకర్ ప్రపంచ స్థాయిలో 13వ ర్యాంకు, ప్రొఫెసర్ రాజగోపాల్ రెడ్డికి 52వ ర్యాంకు, ప్రొఫెసర్ ఎల్ రామమూర్తికి 139 ర్యాంకు దక్కించుకున్నారు. అలాగే ప్రొఫెసర్ వైసీ రత్నాకరంకు 238వ ర్యాంకు, ప్రొఫెసర్ కేటీ రామకృష్ణారెడ్డికి 341వ ర్యాంకు, ప్రొఫెసర్ బీ దేవప్రసాద్ రాజుకు 545వ ర్యాంకు, ఓఎండీ హుస్సేన్ కు 578వ ర్యాంకు, ప్రొఫెసర్ ఎస్ ఉత్తన్నకు 713వ ర్యాంకు దక్కింది. ఈ సందర్భంగా భౌతిక శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ బి.దేవ ప్రసాద్ రాజు మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో ఎస్వీయూ ఫిజిక్స్ విభాగానికి ఇదో అరుదైన ఘనత దక్కిందని కొనియాడారు. ఒకే విభాగానికి చెందిన 8మంది అధ్యాపకులకు టాప్ 1000 ర్యాంకులలో చోటు దక్కడం గర్వకారమన్నారు. ఫిజిక్స్ విభాగంలో కొనసాగుతున్న నాణ్యమైన పరిశోధన, అంతర్జాతీయ స్థాయి ప్రచురణలు, శాస్త్రీయ సహకారాలు, పరిశోధనా ఫలితాలకు ఈ ర్యాంకులు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ టాటా నర్సింగరావు, రిజిస్ట్రార్ భూపతినాయుడు. రెక్టార్ చండ్రాయుడు, అధ్యాపకులు ఈ ఘనత సాధించిన అధ్యాపకులను అభినందించారు.

 

సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి