BREAKING
నో అబ్జక్షన్ సర్టిఫికెట్ల జారీకి సింగిల్ విండో ఏర్పాటు చేయాలి మూసీ అభివృద్ధిపై రైతులతో ముఖాముఖి:తహసీల్దారు చంద్రశేఖర్‌ భారత వైమానిక దళ (IAF) నూతన చీఫ్‌‌గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్: అక్టోబర్ 31న బాధ్యతల స్వీకరణ! జొన్న గట్కా తింటే ఆరోగ్యానికి ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి? విద్యార్థిని చితకా బాదిన ఉపాధ్యాయుడు వెలుగు ప్రత్యేక పాఠశాలలో వరల్డ్ సెరిబ్రల్ పాల్సీ డే రాజధాని పనులపై నిర్మాణ సంస్థలతో సీఎం చంద్రబాబు సమీక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి సర్వే నంబర్ 483 భూములపై రీ -సర్వే... ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారితో బాపట్ల ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారి ప్రత్యేక భేటీ ఎస్‌ఐఆర్‌తో అర్హుల ఓట్లను తొలగించొద్దు.. పారదర్శకంగా జాబితా సవరణ చేయాలి:డిసిసి అధ్యక్షుడు ధారాసింగ్‌ నాయక్‌ ఆచార్య డిగ్రీ కళాశాలలో షీ టీమ్స్ అవగాహన సదస్సు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత జార్జ్ పియస్ కన్నుమూత! అంబులెన్స్‌లోనే ప్రసవం.. మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ తల్లి బిడ్డ క్షేమం అంగన్వాడీ సేవలు బహుళ ప్రయోజనకరం

శ్రీదుర్గా మల్లేశ్వరి ఆలయంలో వరుణయాగం లో పాల్గొన్న సభాపతి అయ్యన్నపాత్రుడు పద్మావతి దంపతులు*

Select Suryaa Now
శ్రీదుర్గా మల్లేశ్వరి ఆలయంలో  వరుణయాగం లో పాల్గొన్న సభాపతి అయ్యన్నపాత్రుడు పద్మావతి దంపతులు*


​నర్సీపట్నంనర్సీపట్నంలోని శ్రీ దుర్గా మల్లేశ్వరి ఆలయంలో మంగళవారం 'వరుణయాగం' కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యాగాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, వారి సతీమణి చింతకాయల పద్మావతి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు సమర్పించారు. వీరితోపాటు వారి తనయుడు, టిడిపి నర్సీపట్నం పట్టణ అధ్యక్షుడు చింతకాయల రాజేష్ కూడా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు.  
​ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ... రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో తాగునీటి కరువు రాకుండా భూగర్భ జలమట్టాన్ని పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ వర్షయాగాలను చేపట్టిందని తెలిపారు. ఈ ఏడాది ఏలినో ప్రభావం వలన ఆరంభంలో వర్షాలు ఆలస్యమవ్వడం వల్ల రైతులు కొంత ఇబ్బంది పడ్డారని, 70 శాతం నాట్లు పూర్తికాగా, మిగిలిన 30 శాతానికి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. తుఫానుల వల్ల పడిన వర్షాలతో కరువు గండం నుంచి బయటపడినప్పటికీ, శాస్త్రవేత్తల సూచనల మేరకు భూగర్భంలో నీటి నిల్వలను పెంచుకోవడం ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు. 
​దశాబ్దాల కాలం నాటి కల అయిన పోలవరంగోదావరి జలాలు అనకాపల్లి వరకు చేరుకోవడం శుభపరిణామమని, వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించి శ్రీకాకుళం వరకు ఈ నీటిని తీసుకెళ్లేందుకు ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. అలాగే నర్సీపట్నం ప్రాంతంలో భూగర్భ జలాలు స్థిరంగా ఉండేందుకు, తాగునీటి సమస్య తీర్చేందుకు అండర్ గ్రౌండ్ పైప్‌లైన్ ద్వారా రవణా పల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలించే పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు.  
​ఈ యాగం ద్వారా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ, కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన వేద పండితులకు, దేవాదాయ శాఖ అధికారులకు, ఆలయ కమిటీ సభ్యులకు, టిడిపి నాయకులకు మరియు భక్తులకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం దుర్గా మల్లేశ్వరి ఆలయంలో దసరా ఉత్సవాలు కరపత్రాలను విడుదల చేశారు.